రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

మానవత్వం చాటుకున్న మంత్రి డా. స్వామి

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

మానవత్వం చాటుకున్న మంత్రి డా. స్వామి

కాన్సర్ బారిన పడ్డ గురుకుల విద్యార్దిని, ఆమె తల్లికి ప్రత్యేక చొరవతో వైద్యం అందించిన మంత్రి

అమరావతి / సెప్టెంబర్ 23 :

కాన్సర్ బారిన పడిన గురుకుల పాఠశాల విద్యార్దిని, ఆమె తల్లికి ప్రత్యేక చొరవతో వైద్యం అందించి మంత్రి డా. డోలా  బాల వీరాంజనేయస్వామి మానవత్వం చాటుకున్నారు. కాకినాడ ఎస్. ఎం నగర్ డా.బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలకు చెందిన ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్దిని మిడియం మంజుల 10 జూలై 2025 కాన్సర్ బారిన పడి ఆస్పత్రిలో చేరింది. విషయం తెలుసుకున్న మంత్రి డా. డోలా  బాల వీరాంజనేయస్వామి, ఏపీ APSWREIS సెక్రటరీ వి. ప్రసన్న వెంకటేష్ చొరవ తీసుకుని విద్యార్దినిని విశాఖలోని హోమీబాబా కాన్సర్ ఆస్పత్రిలో చేర్చించి ప్రత్యేక వైద్యం అందించారు. విద్యార్దిని తల్లికి కూడా కాన్సర్ ఉన్నట్టు వైద్యులు గుర్తించటంతో ఆమెకు కూడా మంత్రి ప్రత్యేక చొరవతో వైద్యం అందించారు. చికిత్స అనంతరం పూర్తిగా కోలుకున్న విద్యార్దిని, ఆమె తల్లి వాణి ఆస్పత్రి నుంచి డిశ్చార్డ్ అయ్యారు. ఈ సంధర్బంగా మంగళవారం నాడు వెలగపూడి శాసనసభ లాబీల్లో మంత్రి డా. డోలా  బాల వీరాంజనేయస్వామిని కలిసి విద్యార్దిని, ఆమె తల్లి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్దిని కాన్సర్ లక్షణాల్ని ప్రాధమిక దశలోనే గుర్తించి ఆస్పత్రిలో చేర్పించిన పాఠశాల సిబ్బందిని, విద్యార్ది ఆరోగ్య పరిస్ధితిని నిరంతరం పర్యవేక్షణ చేసిన APSWREIS అధికారుల్ని, డా. రాజేష్ ని ఈ సంధర్బంగా మంత్రి డా. డోలా  బాల వీరాంజనేయస్వామి అభినంధించారు.

Comments

-Advertisement-