ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి కి సౌకర్యాలు సవ్యంగా ఉండాలి
ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి కి సౌకర్యాలు సవ్యంగా ఉండాలి
-జిల్లా మంత్రి టి.జి భరత్
కర్నూలు, సెప్టెంబర్ 05 (పీపుల్స్ మోటివేషన్):-
ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి కి అన్ని సౌకర్యాలు సవ్యంగా ఉండాలని పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి.భరత్ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి మరియు మెడికల్ కాలేజీ ల అభివృద్ధి పనుల సమీక్ష సమావేశము లో పేర్కొన్నారు.
శుక్రవారం సాయంకాలం మెడికల్ కాలేజీ కాన్ఫరెన్స్ హాల్లో రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి. జి. భరత్ ఆసుపత్రి మరియు మెడికల్ కాలేజ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...ఆసుపత్రిలో వెహికల్ పార్కింగ్ ఈనెల 30 తారీఖు లోపల, ట్రాలీ ట్రాక్ ను అక్టోబర్ 15 లోపల పూర్తి చేయాలని ఏపీఎంఐడీసీ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలోని సిటీ స్కాన్ ను పి పి పి మెయింటెనెన్స్ కు ఇవ్వాలని ఇప్పుడున్న 135 సీసీటీవీ కెమెరాలకు అదనంగా అవసరమైన చోట పది కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. ఆక్సిజన్ పైప్ లైన్లను త్వరగా ఏర్పాటు చేసుకోవాలని, బయో వేస్ట్ డిస్పోజల్ ను రూల్స్ ప్రకారం చేయించాలని, అగ్నిమాపక యంత్రాలను కండిషన్లో ఉంచుకోవాలని ఆదేశించారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ రోగులకు మందులు బయట కొనమని డాక్టర్లు వ్రాయకుండా ఆదేశించాలని సూపరిండెంట్ను ఆదేశించారు. ఐరన్ స్క్రాప్ ను త్వరగా డిస్పోస్ చేసే చర్యలు, ఆస్పత్రిలో జంగల్ క్లియరెన్స్ చర్యలు వెంటనే చేయాలని జంగల్ క్లియరెన్స్ చేయటానికి జెసిబిలను గంటల ప్రకారం మాట్లాడుకుని పనులు పూర్తి చేయాలని ఏపీఎస్ఎంఐడిసి వారిని ఆదేశించారు.
ఆపరేషన్ థియేటర్లో సమస్యలు, క్రిటికల్ కేర్ కు అవసరమైన విషయాలు నాకు రాతపూర్వకంగా తెలియజేసిన విజయవాడలో సంబంధిత అధికారులతో మాట్లాడి చేయిస్తానని మంత్రి టి జి భరత్ తెలియజేశారు. ఈ సందర్భంగా సూపరిండెంట్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రస్తుతం ప్రతిరోజు దాదాపు 1000 మంది అవుట్ పేషెంట్లు రావడం పెరిగిందని, పందుల సమస్య కూడా ఉన్నదని మంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు. మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ విశ్వేశ్వర్ రెడ్డి ని ఆసుపత్రి, మెడికల్ కాలేజ్ మరియు హాస్టల్లో ఉన్న కుక్కలకు స్టెర్లైజేషన్ ఆపరేషన్లు చేయించి వాటిని బయట వదిలిపెట్టాలని ఆదేశించారు. కుక్కలు, పందులు ఆసుపత్రిలోకి రాకుండా అన్ని విధాల చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి రావలసిన 80కోట్ల రూపాయల కు అవసరమైన యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇచ్చే చర్యలు వెంటనే చేపట్టాలని ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి రావలసిందిగా క్యాన్సర్ ఆస్పత్రి సూపరిండెంట్ ప్రకాష్ ను ఆదేశించారు.
ప్రతి 15 రోజులకు ఒకసారి ఆసుపత్రి, మెడికల్ కాలేజ్ అధికారులు మరియు హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్లు కూర్చుని సమస్యలను చర్చించుకొని తన దృష్టికి తీసుకొని రావలసిందిగా మంత్రి ఆదేశించారు.
ఈ సమావేశానికి హాజరయ్యే ముందు పుల్లారెడ్డి డెంటల్ కాలేజ్ వారు హాస్పిటల్ కు అవసరమైన 10 స్ట్రెచర్లు మంత్రి టి.జి.భరత్ చేతుల మీదుగా (దాదాపు 80 వేల రూపాయలు విలువ కలిగినవి) అందించారు.
ఈ సమావేశానికి జి జి హెచ్ సూపర్డెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ చిట్టి నరసమ్మ, కంటి ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, క్యాన్సర్ హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ ప్రకాష్, సి ఎస్ ఆర్ ఎమ్ ఓ డాక్టర్ వెంకటరమణ, జి జి హెచ్ అడ్మినిస్ట్రేటర్ సింధు సుబ్రహ్మణ్యం, డిపిఎం ఉమా, మలేరియా ఆఫీసర్ నూకరాజు,డిప్యూటీ డి ఎం హెచ్ ఓ భాస్కర్, డి సి హెచ్ ఎస్ డాక్టర్ జెఫరుల్లా మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ భాస్కర్ రెడ్డి, డాక్టర్ శివ బాల,హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్లు ప్రదీప్, పద్మజ, ప్రవీణ్ మొదలగువారు హాజరయ్యారు.