రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

మాతా, శిశు వైద్యసేవలకు ఊతం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

మాతా, శిశు వైద్యసేవలకు ఊతం

  • అందుబాటులోకి రానున్న 1,000 పడకలు
  • గుంటూరు జిజిహెచ్ లో 500, కాకినాడ జిజిహెచ్ లో 500
  • రూ.128 కోట్ల వ్యయంతో రెండు నూతన ఎంసిహెచ్ బ్లాకులు
  • రు.51 కోట్లతో వైద్య పరికరాల కొనుగోలుకు మంత్రి సత్యకుమార్ ఆమోదం

అమరావతి:సెప్టెంబర్ 07 

ప్రభుత్వాస్పత్రుల్లో మాతా, శిశు వైద్య సేవలను విస్తరింపజేసి గర్భిణులు, నవజాత శిశువుల మరణాలను తగ్గించే కూటమి ప్రభుత్వ ప్రయత్నాల్లో ఒక పెద్ద అడుగు ముందుకు పడనుంది. గుంటూరు, కాకినాడ సర్వజన ఆస్పత్రు(జిజిహెచ్ )ల్లో రెండు నూతన ఎంసిహెచ్ (మదర్ అండ్ ఛైల్డ్ కేర్) బ్లాకుల ద్వారా సేవలను పెంచడానికి ప్రభుత్వం సిద్ధమైంది. 

త్వరలో అందుబాటులోకి రానున్న ఈ రెండు బ్లాకుల్లో వైద్యసేవలందించడానికి అవసరమయ్యే వైద్య పరికరాలను, ఇతర అవసరమైన వస్తువులను రూ.51.33 కోట్లతో కొనుగోలు చేయడానికి వైద్యారోగ్యశాఖ మంత్రి  సత్యకుమార్ యాదవ్ ఆమోదం తెలిపారు.

రెండు నూతన ఎంసిహెచ్ బ్లాకులు

గుంటూరు జిజిహెచ్ లో పూర్వ విద్యార్ధుల (GMCANA) ఆర్థిక సహకారంతో రూ.86 కోట్లతో నిర్మించబడుతున్న నూతన ఎంసిహెచ్ బ్లాకు త్వరలో పూర్తి కానున్నది. దీనిలో 500 పడకల ద్వారా మాతా, శిశు వైద్యసేవలల్ని విస్తృతం చేయనున్నారు. ఇదే రీతిన, కాకినాడ‌లోని రంగరాయ వైద్య కళాశాల పూర్వ విద్యార్ధుల (RMCANA) సహకారంతో రూ.46 కోట్ల‌తో నిర్మాణంలో వున్న మరో ఎంసిహెచ్ బ్లాకు కూడా త్వరలో పూర్తి కానున్నది. దీనిలో కూడా మరో 500 పడకలతో సేవలందించేదుకు వీలుంది 

రూ.51 కోట్లతో వైద్య పరికరాలు

ఈ రెండు ఎంసిహెచ్ బ్లాకు ల ద్వారా సేవలందించేందుకు అవసరమైన వైద్య పరికరాలు, అనుబంధ సామ్రగిని రూ.51.33 కోట్లతో కొనుగోలు చేయడానికి మంత్రి  సత్యకుమార్ యాదవ్ అనుమతించారు. మొత్తం 332 రకాలకు చెందిన 5,687 పరికరాలు మరియు సామ్రగిని కొనుగోలు చేస్తారు. 

గుంటూరు జిజిహెచ్ లో 37 రకాలకు చెందిన 1,187 పరికరాలను రు.23.51 కోట్లతో అందజేస్తారు. కాకినాడ జిజిహెచ్ లో 295 రకాలకు చెందిన 4,500 పరికరాలను రు.27.82 కోట్లతో ఏర్పాటు చేస్తారు.

ఈ కొత్త బ్లాకుల కోసం ప‌డ‌క‌లు, బెడ్లు, ఐసియు బెడ్లు, పేషెంట్ మోనిట‌ర్లు, వెంటిలేట‌ర్లు, డీఫిజ్రిరేట‌ర్లు, ఇసిజి మెషీన్లు, మొబైల్ ఎక్స్‌రే యూనిట్లు, మొబైల్ ఆల్ట్రా సౌండ్ మెషీన్లు, నిబులైజ‌ర్లు, డెలివ‌రీ సెట్లు, ఆక్సీ మీట‌ర్లు, ఫోటో థెర‌పీ యూనిట్లు, స‌ర్జిక‌ల్ ఛైర్లు వంటి ప‌లు ర‌కాల వైద్య ప‌రిక‌రాల‌ను భారీ స్థాయిలో కొనుగోలు చేయ‌నున్నారు.

మంత్రి అభినందనలు

ఈ రెండు ఆస్పత్రుల్లో ఎంసిహెచ్ బ్లకుల నిర్మాణానికి ముందుకొచ్చిన గుంటూరు మెడికల్ కాలేజీ అలమ్నై ఆఫ్ నార్త్ అమెరికా (GMCANA), కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ అలమ్నై ఆఫ్ నార్త్ అమెరికా (RMCANA)లను మంత్రి  సత్యకుమార్ యాదవ్ అభినందించారు. ఈ బ్లాకుల నిర్మాణాలకు కృషి చేసిన ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లు, సిబ్బందిని మంత్రి ప్రశంసించారు.

Comments

-Advertisement-