జి.ఎస్.టి తగ్గింపు టూరిజం రంగానికి మంచి ఊతం - సెట్కూర్ సి ఈ ఓ డాక్టర్.వేణు గోపాల్
జి.ఎస్.టి తగ్గింపు టూరిజం రంగానికి మంచి ఊతం - సెట్కూర్ సి ఈ ఓ డాక్టర్.వేణు గోపాల్
జిల్లా కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు సెట్కూరు మరియు మైనింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో లాడ్జి లు,రెస్టారెంట్ లు, ట్రావెల్స్ లలో ' సూపర్ జి యస్ టి సూపర్ సేవింగ్' పై ప్రచారం నిర్వహించారు. అందులో భాగంగా హరిత హోటల్, అతిధి లాడ్జి మరియు పిస్తా హౌస్ లలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించడమైనది.
సెట్కూర్ సి ఈ ఓ డాక్టర్ .వేణు గోపాల్ మాట్లాడుతూ నూతన జి యస్ టి స్లాబు ల సవరణ వల్ల జిల్లా టూరిజమ్ రంగంలో బడ్జెట్ హోటళ్లలో 12% నుండి 5%, ప్రీమియం హోటళ్లలో రూమ్ లలో 18% నుంచి 12% వరకు తగ్గింపు చేయడం జరిగినదని దీనివల్ల జిల్లాలో టూరిజం కు ఆదరణ పెరుగుతున్నదని తెలిపారు.
జి.ఎస్.టి తగ్గింపు వల్ల పర్యాటక ప్రాంతాలకు, తీర్థ యాత్రలకు వెళ్లేవారికి, వినోద, సాంస్కృతిక ప్రదేశాల సందర్శకులకు, వ్యాపార పరంగా వివిధ ప్రాంతాలకు సందర్శించే వారికీ చాల డబ్బు ఆదా అవుతుందని తెలిపారు.
డిప్యూటీ డైరెక్టర్, మైన్స్ అండ్ జియాలాజి రవి చంద్ర మాట్లాడుతూ జి.ఎస్.టి-02 సంస్కరణల లో హోటళ్లు, రెస్టారెంట్లు, ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లకు ఆదరణ పెరిగిందని, హోటళ్లు, లాడ్జిల యజమానులు ఈ తగ్గింపును బిల్లులో వినియోగదారులకు చూపించాలని తద్వారా వినియోగదారులలో విశ్వాసం పెరుగుతుందని తెలిపారు.
టూరిజం ప్యాకేజీలు కూడా తగ్గాయని తద్వారా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న పుణ్య క్షేత్రాల సందర్శన కూడా పెరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమాలలో టూరిజం మేనేజర్ వినోద్, సెట్కూరు సిబ్బంది శ్యామ్ కుమార్, కళా నిధీశ్ పాల్గొన్నారు.
ఇట్లు
డా.కె.వేణుగోపాల్
సీఈఓ, సెట్కూరు