ప్రధానమంత్రి వర్యుల కార్యక్రమం విజయవంతం చేసే విధంగా అని రకాల చర్యలు తీసుకున్నాం
ప్రధానమంత్రి వర్యుల కార్యక్రమం విజయవంతం చేసే విధంగా అని రకాల చర్యలు తీసుకున్నాం
ప్రధానమంత్రి ప్రోగ్రామ్ స్పెషల్ ఆఫీసర్ సీనియర్ ఐఏఎస్ అధికారి వీరపాండియన్
కర్నూలు, అక్టోబర్ 15:- ప్రధానమంత్రి వర్యుల కార్యక్రమం విజయవంతం చేసే విధంగా అని రకాల చర్యలు తీసుకుంటున్నామని ప్రధానమంత్రి ప్రోగ్రామ్ స్పెషల్ ఆఫీసర్ సీనియర్ ఐఏఎస్ అధికారి వీరపాండియన్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి వివరించారు..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్న సందర్భంగా ఉమ్మడి జిల్లాలో చేస్తున్న ఏర్పాట్లపై రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు విజయవాడ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి ప్రోగ్రామ్ స్పెషల్ ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్ అధికారి వీర పాండియన్, జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి లతో సమీక్ష నిర్వహించారు..
ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రోగ్రామ్ స్పెషల్ ఆఫీసర్ ఏర్పాట్ల గురించి వివరిస్తూ వేదిక మీద చేస్తున్న ఏర్పాట్లు, ప్రధాన మంత్రి హెలిప్యాడ్ ఏర్పాట్లు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల హెలిప్యాడ్ ఏర్పాట్ల వివరాల గురించి, బ్యాక్ డ్రాప్ డిజైన్ గురించి ముఖ్యమంత్రి కి వివరించారు.. ఈరోజు రీ హార్సల్ కార్యక్రమం నిర్వహించుకుంటున్నామన్నారు... ప్రజలకు ఏర్పాటు చేస్తున్న భోజన సదుపాయం, త్రాగు నీటి సరఫరా గురించి వివరించారు...
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ప్రధాన మంత్రి వర్యుల పర్యటన కి సంబంధించి చేస్తున్న ఏర్పాట్ల గురించి ముఖ్యమంత్రి ర వివరిస్తూ.. ప్రధాన మంత్రి 3 హెలిప్యాడ్ లు, రాష్ట్ర ముఖ్యమంత్రి కి 2 హెలిప్యాడ్ నిర్మాణాలు 100 శాతం పూర్తయ్యాయి అన్నారు.. అందుకు సంబంధించిన బ్యారికెడింగ్ పనులు కూడా 100 శాతం పూర్తయ్యాయి అన్నారు.. పార్కింగ్ ప్రదేశంలో టాయిలెట్, విద్యుత్ సరఫరా, హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేస్తున్నామన్నారు... సౌండ్ సిస్టమ్ ఏర్పాట్లు అని కూడా వెరిఫై చేసుకుంటున్నామన్నారు... విద్యుత్, త్రాగు నీటి సరఫరా, అంబులెన్స్ ఏర్పాట్లు, 20 బెడెడ్ హాస్పిటల్, 10. బెడెడ్ హాస్పిటల్ ఏర్పాట్ల, స్పెషలిస్ట్ డాక్టర్ ఏర్పాట్ల గురించి ముఖ్యమంత్రి గారికి వివరించారు..
జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రధాన మంత్రి వర్యుల పర్యటన కి సంబంధించి తీసుకుంటున్న భద్రతా చర్యల గురించి ముఖ్యమంత్రి కి వివరించారు....
వీడియో కాన్ఫరెన్స్ లో ఐఏఎస్ అధికారి దినేష్, విజయ సునీత, డిల్లీ రావు, శౌర్యమాన్ పటేల్, జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశీ, సచిన్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు..