ఏపీకి మరిన్ని పర్యాటక ప్రాజెక్టులు కేటాయించండి
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
ఏపీకి మరిన్ని పర్యాటక ప్రాజెక్టులు కేటాయించండి
- కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కోరిన పర్యాటక మంత్రి కందుల దుర్గేష్
- ఉదయ్ పూర్ లో అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల పర్యాటక మంత్రులతో 2వ రోజు జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు ఏపీ ప్రతిపాదనలు సమర్పించిన మంత్రి కందుల దుర్గేష్
- తిరుపతిలో కల్నరీ ఇన్ స్టిట్యూట్, అమరావతిలో పర్యాటక భవన్, రాజమహేంద్రవరంలో నేషనల్ స్కూల్ డ్రామా కేటాయించాలని అభ్యర్థన
- త్వరలోనే తిరుపతి, విశాఖపట్నంలను ప్రపంచ పర్యాటక గమ్యస్థానాలుగా అభివృద్ధి చేస్తామని కేంద్రం హామీ
- ఏపీ పర్యాటక విధానం భేష్ అని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రశంసలు
- మంత్రి కందుల దుర్గేష్ వివరణపై సంతృప్తి వ్యక్తం వేసిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్
ఉదయ్ పూర్ : గ్లోబల్ డెస్టినేషన్ సెంటర్ లుగా తిరుపతి, విశాఖల అభివృద్ధితో పాటు త్వరలోనే ఏపీకి మరిన్ని పర్యాటక ప్రాజెక్టులు వచ్చే అవకాశముందని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల పర్యాటక మంత్రులతో రెండవ రోజు జరిగిన సమావేశంలో ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ ఏపీ ప్రతిపాదనలు వెల్లడించారు. ప్రధానంగా తిరుపతిలో కల్నరీ ఇన్ స్టిట్యూట్, అమరావతిలో పర్యాటక భవన్, రాజమహేంద్రవరంలో నేషనల్ స్కూల్ డ్రామా కేటాయించాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను మంత్రి కందుల దుర్గేష్ అభ్యర్థించారు. ఇందుకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత పర్యాటక భవన్ తెలంగాణలోనే ఉండిపోయిందని ఈ క్రమంలో ఏపీకి మంజూరు చేయాల్సిందిగా మంత్రి దుర్గేష్ కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్మించ తలపెట్టిన అత్యాధునిక పర్యాటక భవన్ కు త్వరితగతిన ఆమోదం తెలిపితే తగిన సదుపాయాలు ఏర్పాటు చేస్తామని, తద్వారా పర్యాటకులకు అవసరమయ్యే సమాచారం లభించేందుకు అవకాశం ఉంటుందన్నారు.
ఏపీ పర్యాటక విధానం భేష్ అని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రశంసలు కురిపించారు. కాన్ఫరెన్స్ లో మంత్రి కందుల దుర్గేష్ వివరణపై సంతృప్తి వ్యక్తం చేశారు. అంతకుముందు అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల పర్యాటక మంత్రులతో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ గ్రూప్ ఫోటో దిగారు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్, టూరిజం ఎండీ ఆమ్రపాలి కాట ప్రత్యేకంగా భేటీ అయి రాష్ట్ర పర్యాటకాభివృద్ధికి సహకరించాలని కోరారు. ఇప్పటికే వివిధ పథకాల ద్వారా రాష్ట్ర పర్యాటకాభివృద్ధికి సాయం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య సహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు.
Comments