సహచర మంత్రులతో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమీక్షా సమావేశం
సహచర మంత్రులతో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమీక్షా సమావేశం
- కర్నూలులో ప్రధాని పర్యటన ఏర్పాట్లు జోరుగా
ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు పర్యటన సందర్భంగా జరుగుతున్న “సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్” భారీ బహిరంగ సభ ఏర్పాట్లపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, గుమ్మడి సంధ్యారాణి, అలాగే కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
మంత్రి అచ్చెన్న మాట్లాడుతూ ప్రధాని పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అత్యంత శ్రద్ధగా, సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు. ప్రతి శాఖ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, కూటమి నేతలు, కార్యకర్తలు ఒకే బృందంలా పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ట్రాఫిక్ నియంత్రణ నుండి సభా ప్రాంగణం వరకు అన్ని అంశాలను సమగ్రంగా పర్యవేక్షించాలన్నారు. సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్ సభ దేశ ఆర్థికాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను ప్రజల ముందుంచే వేదిక. ప్రధానమంత్రి ప్రజలతో నేరుగా మమేకమవుతారు. అందువల్ల ఈ సభను చారిత్రాత్మకంగా మార్చాలన్నారు. కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా ప్రజల్లోకి వెళ్లి సభ విజయవంతం కావడంలో పాత్ర వహించాలని మంత్రి సూచించారు. ప్రతి గ్రామం, ప్రతి మండలంలో ప్రజల్లో ఉత్సాహం నింపి, ప్రధానమంత్రిని అద్భుత స్వాగతం పలుకుదాం. ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే సభగా నిలవాలని అన్నారు.
తదుపరి, సభా ప్రాంగణం, వేదిక, భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్, నీటి సదుపాయం, మీడియా సౌకర్యాలు, వాలంటీర్ వ్యవస్థ వంటి అంశాలపై విస్తృతంగా సమీక్షించారు. సంబంధిత అధికారులకు స్పష్టమైన సూచనలు జారీ చేశారు. ప్రధాని పర్యటన రాష్ట్రానికి మరో కొత్త అవకాశాల ద్వారాలు తెరుస్తుంది. ఈ కార్యక్రమం కేవలం ఒక సభ కాదు, ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి యాత్రకు నూతన దిశా నిర్దేశం చేసే ఘట్టం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సభ విజయవంతం కోసం అందరూ ఒకే తాటిపై నిలిచి, సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు