రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

'వసంతం–2025’ చేనేత ప్రదర్శనకు నారా లోకేశ్ శ్రీకారం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

'వసంతం–2025’ చేనేత ప్రదర్శనకు నారా లోకేశ్ శ్రీకారం
General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

విజయవాడ, నవంబర్ 5 ( పీపుల్స్ మోటివేషన్): విజయవాడ ఎంజీ రోడ్డులోని శ్రీ శేషసాయి కల్యాణ వేదికలో క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వసంతం–2025’ చేనేత & చేతివృత్తుల ప్రదర్శనకు మంత్రి నారా లోకేశ్ ప్రారంభం పలికారు. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వచ్చిన చేనేత, చేతివృత్తుల కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులతో 70కి పైగా స్టాల్స్ ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేయడం విశేషం. స్టాల్స్‌ను సందర్శించిన లోకేశ్, చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు ఇలాంటి ప్రదర్శనలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. సహజసిద్ధ రంగులతో తయారుచేసిన చేనేత వస్త్రాలకు డిమాండ్ పెరుగుతోందని, ఈ రంగంలో నూతన ఆవిష్కరణలు అవసరమని అన్నారు. ఈ సందర్భంగా ‘కొత్తూరు వసంత వర్ణ’ అనే కొత్త చేనేత బ్రాండ్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ బ్రాండ్‌ ద్వారా సహజ రంగులతో తయారైన వస్త్రాలను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రదర్శనలో సాంప్రదాయ హ్యాండ్‌లూమ్ వర్క్, నేచురల్ డై టెక్స్టైల్‌లు, హ్యాండ్‌క్రాఫ్ట్‌లు, స్థానిక కళల ప్రత్యేక ఉత్పత్తులు ఆకర్షణగా నిలిచాయి. నగరవాసులు, చేనేత అభిమానులు, డిజైనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ప్రదర్శన కొన్ని రోజులు కొనసాగనుంది.

Comments

-Advertisement-