రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

జల్ జీవన్ మిషన్ కి బీజం వేసింది భగవాన్ సత్యసాయి బాబా

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

జల్ జీవన్ మిషన్ కి బీజం వేసింది భగవాన్  సత్యసాయి బాబా

• ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ  నేటి సంకల్పానికి నాడు  బాబా వారు అంకురం వేశారు

• నాడు ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు  ప్రభుత్వపరమైన అనుమతులు ఇచ్చారు

• సేవాతత్పరతతో ఎంతో మందిని ప్రభావితం చేసిన ఆధ్యాత్మిక శక్తి  సత్యసాయి బాబా వారు

• ఆధ్యాత్మిక తేజస్సు, విశ్వప్రేమ వల్లే అది సాధ్యపడింది

• సత్యసాయిబాబా వారి శతజయంతి ఉత్సవాల్లో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ 


‘ప్రతి మనిషికీ రోజుకి కనీసం 55 లీటర్ల రక్షిత తాగునీరు ఇవ్వాలన్నది ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ  సంకల్పం. ప్రభుత్వపరంగా  నరేంద్ర మోదీ  నేడు జల్ జీవన్ మిషన్ పథకాన్ని తీసుకువస్తే.. ఏ ప్రభుత్వం ఆలోచన చేయని రోజుల్లో ఓ ఆధ్యాత్మిక గురువుగా ప్రజల దాహర్తిని తీర్చాలన్న ఆలోచన  సత్యసాయి బాబా వారు చేశారు. జల్ జీవన్ మిషన్ పథకానిక సత్యసాయి బాబా వారు ఎప్పుడో అంకురం వేశార’ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు  పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రజల దాహం తీర్చాలన్న ఆలోచన వచ్చిన తరువాత  సత్యసాయి బాబా వారు అప్పటి ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు కి తెలియచేశారు. ఆ సత్కార్యానికి ప్రభుత్వపరమైన అనుమతులను  చంద్రబాబు  సత్వరం అందేలా చూశారు. నేడు ఆ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతోపాటు తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో లక్షలాది మంది ప్రజలకు తాగునీరు అందుతోందని చెప్పారు. ఆధ్యాత్మిక తేజస్సు, విశ్వప్రేమ ఉన్న వ్యక్తుల వల్లే ఇది సాధ్యమన్నారు. 

బుధవారం పుట్టపర్తిలో భగవాన్  సత్యసాయి బాబా వారి శతజయంతి ఉత్సవాలకు ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ , ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు , ఇతర ప్రముఖులతో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో  పవన్ కళ్యాణ్  మాట్లాడుతూ “భగవాన్  సత్యసాయి బాబా గొప్ప ఆధ్యాత్మిక తేజస్సు కలిగిన వారు. భారత దేశంలో, మన రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలోని అనంతపురం జిల్లా, విపరీతమైన నీటి కొరత ఉండే జిల్లా, ప్రజలు ఉపాధి కోసం వలసలు వెళ్లే జిల్లాలో ఆయన పుట్టారు. మహానుభావులు మాత్రమే అలాంటి జన్మను తీసుకోగలరు.  సాయిబాబా వారి గొప్పదనం గురించి మన దేశస్తులకంటే విదేశీయులే ఎక్కువ చెబుతారు. 30 ఏళ్ల క్రితం సింగపూర్ లోని చైనీస్ ఇళ్లలో  బాబా వారి ఫోటోలు చూశాను. స్టీవెన్ సిగాల్ అనే హాలీవుడ్ నటుడు బాబా ని కలవాలన్న తన కోరికను అన్నయ్య  చిరంజీవి కి చెప్పి ఇక్కడికి వచ్చి బాబా వారి ఆశీర్వచనం తీసుకువెళ్లడం అప్పట్లో ఆశ్చర్యాన్ని కలిగించింది. 40 ఏళ్ల క్రితం ఈ ప్రాంతానికి విదేశీ భక్తులు వస్తారని, ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడతారని ఎవరూ ఊహించరు.  సత్యసాయి బాబా వారి ఆధ్యాత్మిక శక్తితోనే అది సాధ్యపడింది.

• బాబా వారి సేవా స్ఫూర్తిని కొనసాగిస్తాం

సాయిబాబా వారి సేవాతత్పరతకు ప్రభావితం అయిన వారి సంఖ్య లెక్కలకందదు. పుట్టపర్తి వచ్చి సేవ చేసే ప్రముఖులను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఒక వ్యక్తి  సచిన్ టెండూల్కర్ లాంటి ఎంతో మంది ప్రముఖులను ప్రభావితం చేశారు. అలాంటి అరుదైన ఆధ్యాత్మిక శక్తి మన భారత దేశంలో, మన రాష్ట్రంలో, మన అనంతపురం జిల్లాలో పుట్టడం ఎంతో ఆనందం కలిగించే అంశం. ఆయన సేవా స్ఫూర్తిని  ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ  నేతృత్వంలో ముందుకు తీసుకువెళ్తాము అని మాటిస్తున్నామ”న్నారు.

• సత్యసాయి మహాసమాధి దర్శనం

అంతకు ముందు ప్రధాని  నరేంద్ర మోదీ , ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు తో కలసి ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ హాల్లో భగవాన్  సత్యసాయి బాబా వారి మహా సమాధిని దర్శించుకున్నారు.  బాబా వారి బంగారు విగ్రహం వద్ద నిర్వహించిన పూజల్లో పాల్గొన్నారు.

• సత్యసాయి బాబా వారి స్మారక నాణెం విడుదల

సత్యసాయి బాబా వారి శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రూపొందించిన రూ.100 స్మారక నాణాన్ని, పోస్టల్ స్టాంపులు  ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ  విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు  జి.కిషన్ రెడ్డి ,  రామ్మోహన్ నాయుడు ,  శ్రీనివాస వర్మ , రాష్ట్ర మానవ వనరులు, ఐటి, విద్యా, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి  నారా లోకేష్  ప్రముఖ క్రికెటర్, భారతరత్న  సచిన్ టెండూల్కర్ , మాజీ మిస్ వరల్డ్  ఐశ్వర్యరాయ్ బచ్చన్ ,  సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ  రత్నాకర్  తదితరులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-