ఎస్సి, ఎస్టీ విద్యార్థుల విద్య, సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ
ఎస్సి, ఎస్టీ విద్యార్థుల విద్య, సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ
రూ. 80 లక్షలతో అంబేద్కర్ గురుకులాల విద్యార్థులకు ఐఐటీ నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ సెంటర్ నిర్మాణం
మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి
విజయవాడ ఐఐటీ,నీట్ ఎక్సలెన్సీ సెంటర్లో మంత్రి డా.స్వామి ఆకస్మిక తనిఖీ
విజయవాడ, నవంబర్ 18 : విజయవాడలో ఐఐటీ,నీట్ ఎక్సలెన్సీ సెంటర్లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి మంగళవారం నాడు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నగరంలో ని డా.బి. ఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ లో ఐఐటీ, నీట్ లో తృటిలో అవకాశం కోల్పోయిన డా.బి. ఆర్ అంబేద్కర్ గురుకులాల విద్యార్థులకు ఐఐటీ నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి స్వామి ఆకస్మిక తనిఖీ చేశారు. స్టడీ సర్కిల్లో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు అడిగి తెలుసుకున్న అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ..... ఎస్సి, ఎస్టీ విద్యార్థుల సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. డా. బి.ఆర్ అంబేద్కర్ గురుకులాల విద్యార్థులకు ఐఐటీ, నీట్ కోచింగ్ సెంటర్లను 3 నుంచి 10 కి పెంచాం. విజయవాడ కబేలా సెంటర్ లో రూ. 80 లక్షలతో శాశ్వత ఐఐటీ నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ సెంటర్ నిర్మిస్తున్నాం. పేద విద్యార్థుల కోసం కూటమి ప్రభుత్వం ఎంత ఖర్చునైనా భరిస్తుంది. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు అందిపుచ్చుకొని విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థితిలో స్థిరపడాలని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు.
