ఇమాములు.. మౌజన్ల వేతనాలు నిలిపితే కఠిన చర్యలు
ఇమాములు.. మౌజన్ల వేతనాలు నిలిపితే కఠిన చర్యలు
మసీదు కమిటీ లను హెచ్చరించిన మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్
ఇమాములు,మౌజన్ల వేతనాలు నిలిపితే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్రంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మసీదుల కమిటీలను రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అమరావతిలో బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో హెచ్చరించారు.రాష్ట్రo లోని ఇమాములు, మౌజన్లకు పెండింగ్ వేతనాలకు సంబంధించి కూటమి ప్రభుత్వం రూ. 90 కోట్లు మొత్తాన్ని ఈనెల12వ తేదీన విడుదల చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.
తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ నెల 11 వ తేదిన మైనార్టీ సంక్షేమ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సభికుల హర్షద్వానాల మధ్య హామీ ఇచ్చి 24 గంటల్లోపే ఇమాములు మౌజన్ల కు వేతనాల చెల్లింపుకు రూ. 90 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం జారీ చేసిందన్నారు. నిధులు విడుదల చేస్తూ జీవో జారీ అయిన రోజు రాత్రి నుంచే మసీదుల కమిటీల బ్యాంక్ అకౌంట్లకు ఇమాములు, మౌజన్ల జీతాల మొత్తాన్ని ఆన్ లైన్ ద్వారా నేరుగా బదిలీ చేసామన్నారు. రాష్ట్రంలో కొన్నిచోట్ల మసీదు కమిటీల అకౌంట్లో జమ అయిన మొత్తాన్ని ఇమాములు, మౌజన్లకు చెల్లించలేదన్న ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చాయని మంత్రి తెలిపారు. వెంటనే మసీదు కమిటీల ప్రతినిధులు వారి అకౌంట్లకు జమ అయిన వేతనాల మొత్తాన్ని వెంటనే తమ తమ పరిధిలోని ఇమాములు, మౌజన్ల కు చెల్లించాలని మంత్రి ఆదేశించారు. అలా చేయని పక్షంలో, మసీదుల కమిటీల పై ఫిర్యాదులు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే కమిటీలను రద్దు చేయడానికి వెనుకాడబోమని మంత్రి ఫరూక్ ఘాటుగా హెచ్చరించారు.
