బల్లెడ అప్పలరాజు మాస్టార్ కళాత్మక బోధనపై మంత్రి లోకేష్ ప్రశంసలు
బల్లెడ అప్పలరాజు మాస్టార్ కళాత్మక బోధనపై మంత్రి లోకేష్ ప్రశంసలు
పాతపట్నం, నవంబర్ 3 ( పీపుల్స్ మోటివేషన్):
ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్ పాతపట్నంలో బోటనీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బల్లెడ అప్పలరాజు మాస్టారు పట్ల రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ప్రశంసలు కురిపించారు. అప్పలరాజు మాస్టారు బోధనా శైలి, కళాత్మక దృష్టికోణం నిజంగా స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
మోడల్ స్కూల్‌లో సహ ఉపాధ్యాయులు, సిబ్బంది సహకారంతో ల్యాబ్‌ను విజ్ఞానవంతంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన తీరు చూసి తాను ఎంతో ఆనందించానని మంత్రి ట్వీట్ చేశారు. సైన్స్, నైతిక విలువలు, సాధారణ జ్ఞాన అంశాలు ప్రతిబింబించేలా ల్యాబ్‌ను కళాత్మకంగా రూపొందించి నిర్వహిస్తున్న తీరు విద్యార్థుల్లో ఆసక్తిని పెంచుతోందని పేర్కొన్నారు.
ఇలాంటి నిబద్ధతతో పనిచేస్తున్న ఉపాధ్యాయులు విద్యా రంగానికి ఆదర్శమని, రాష్ట్రంలోని ఇతర పాఠశాలలు కూడా ఈ తరహా సృజనాత్మక విధానాలను అనుసరించాలని మంత్రి లోకేష్ సూచించారు.
