చేవెళ్ల ప్రమాదం బాధాకరం
చేవెళ్ల ప్రమాదం బాధాకరం
- మృతుల కుటుంబాలకు సానుభూతి: సీఎం చంద్రబాబు
అమరావతి, నవంబర్ 3 (పీపల్స్ మోటివేషన్):
తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్ర ప్రజలను తీవ్రంగా కలచివేసింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన పలువురు ప్రయాణికుల మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గాఢ సంతాపం తెలిపారు.
“మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను” అని సీఎం పేర్కొన్నారు.
ప్రభుత్వ యంత్రాంగం గాయపడిన వారిని కాపాడేందుకు పూర్తి సహకారం అందించాలని, వైద్య సేవల్లో ఎటువంటి లోపం చోటు చేసుకోకూడదని ఆయన ఆకాంక్షించారు.
చేవెళ్ల రోడ్డు ప్రమాదం రాష్ట్ర ప్రజలను విషాదంలో ముంచెత్తిందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.
