రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఆర్థిక కేంద్రంగా అమరావతి

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

ఆర్థిక కేంద్రంగా అమరావతి

- రాష్ట్ర పునర్నిర్మాణానికి కేంద్రం అందిస్తోన్న సాయం ఎనలేనిది

- బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థల కార్యకలాపాలతో ఆర్థిక వృద్ధి

- ప్రజా సంక్షేమంతోపాటు అభివృద్ధికి పెద్ద పీట  

- అమరావతిలో 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రివర్యులు  పవన్ కళ్యాణ్  

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

రాష్ట్ర పురోగతి కోసం వేస్తున్న ప్రతి అడుగులో ప్రధాని  నరేంద్ర మోదీ  నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు మరువలేనిదని, ముఖ్యంగా ప్రజా రాజధాని అమరావతి అభివృద్ధికి కేంద్రం అందిస్తోన్న ప్రోత్సాహం ఎంతో విలువైనదని ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కేంద్రం నుంచి వస్తున్న ఆర్థిక సాయం కాగితాల లెక్కల్లో కరిగిపోకుండా, జరుగుతున్న అభివృద్ధి ప్రతి ఒక్కరికీ కనబడేలా జవాబుదారీతనంతో మా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. అమరావతిలో 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలు నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి  నిర్మలా సీతారామన్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తో కలిసి  పవన్ కళ్యాణ్  పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి  పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రులు  నారా లోకేష్,  పొంగూరు నారాయణ,  పయ్యావుల కేశవ్,  కందుల దుర్గేష్,  నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే  శ్రవణ్ కుమార్, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

ఈ సందర్భంగా  పవన్ కళ్యాణ్  మాట్లాడుతూ “బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీబీఐ, ఎల్ఐసీ లాంటి 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలు ఒకేసారి, ఒకే చోట కొలువుదీరనుండటం చాలా అరుదు.  

• ఆర్థిక కేంద్రంగా అమరావతి అవతరిస్తుంది 

నేడు పునాది వేసిన బ్యాంకింగ్ స్ట్రీట్... అమరావతి నగరానికి ఆర్థిక శక్తినిచ్చే అతిపెద్ద అడుగు. ప్రధాన బ్యాంకుల కార్యాలయాలు, ఆర్థిక సంస్థలు ఒకే చోట కొలువుదీరడం వల్ల ఆర్థిక కార్యకలాపాలు, వ్యాపార లావాదేవీలు వేగం పుంజుకుంటాయి. పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరుగుతుంది. ఆ విశ్వాసం అమరావతిని ఆర్థిక కేంద్రంగా నిలబెడుతుంది. ఈ ఆర్థిక సంస్థల ఏర్పాటు ద్వారా రాజధానికి రూ.1,328 కోట్ల పెట్టుబడులు రావడంతో పాటు సుమారు 6,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మాటకు కట్టుబడి 34,915 ఎకరాల భూములు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చిన రైతుల నమ్మకమే అమరావతికి నగరానికి పునాది. నేడు పునాది వేసింది కేవలం భవనాలకు కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు పడిన పునాది ఇది. అమరావతి ఒక ఆర్థిక కేంద్రo, విద్యా కేంద్రం, ఒక పరిశోధన కేంద్రం, ఒక మంచి పరిపాలనా కేంద్రంగా ఎదగడానికి నేటి పునాది ఎంతో బలం చేకూరుస్తుంది.  

• కేంద్రం అండతో రాష్ట్ర అభివృద్ధి పరుగులు 

రాష్ట్రం అభివృద్ధిపథంలో ముందుకు వెళ్లడానికి కేంద్రం ప్రభుత్వం ఎంతో సహకారం అందిస్తోంది. ఎన్నో ప్రధాన ప్రాజెక్టులకు కేంద్రం అండగా నిలుస్తోంది. ఈ ఏడాది జనవరిలో విశాఖలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ  రూ. 2 లక్షల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వీటి ద్వారా దాదాపు 7.5 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కేంద్రం అండతోనే అమరావతి పునర్నిర్మాణ పనులు రూ. 1.7 లక్షల కోట్లతో ప్రారంభమయ్యాయి. కర్నూలులో జరిగిన సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో… ప్రధాన మంత్రి గారు రూ. 13,429 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఇందులో భాగంగా కొప్పర్తి- ఓర్వకల్లు పారిశ్రామిక కారిడార్ల ద్వారా వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ రూ.11 వేల కోట్ల ఆర్థిక సహాయ ప్యాకేజీకి కేంద్రం ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరానికి రూ. 12,500 కోట్లు, అమరావతి రాజధాని నిర్మాణానికి రూ. 15 వేల కోట్లు ఆర్థిక సాయాన్ని సమకూర్చింది. రాష్ట్రంపై ప్రత్యేక అభిమానంతో నిధులు కేటాయిస్తున్న  ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ కి, ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ కి ప్రత్యేక ధన్యవాదాలు” అన్నారు.

Comments

-Advertisement-