రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

హాస్టళ్లలో అక్రమాలను సహించేది లేదు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

హాస్టళ్లలో అక్రమాలను సహించేది లేదు

  • రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
  • పులివెందుల అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారిణి జ్యోతి సస్పెన్షన్
  • ఆమెకు సహకరించిన డీబీసీడబ్ల్యూవో అంజల దేవీ విధుల నుంచి రిలీవ్
  • విజయవాడ హెడ్డాఫీసుకు రిపోర్టు చేయాలని ఆదేశం
  • అక్రమాలు రుజువు కావడంతోనే చర్యలు : మంత్రి సవిత


అమరావతి : బీసీ హాస్టళ్లు, ఎంజేపీ బీసీ గురుకులాల నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా, అక్రమాలకు పాల్పడినా సహించేది లేదని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత హెచ్చరించారు. అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో కడప జిల్లా పులివెందుల అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారిణిని విధుల నుంచి సస్పెండ్ చేశామన్నారు. ఆమె అక్రమాలకు పరోక్షంగా సహకరించిన జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారిణిని హెడ్డాఫీసులో రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో ఆదేశించినట్లు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం మంత్రి సవిత ఒక ప్రకటన విడుదల చేశారు. కడప జిల్లా పులివెందులకు చెందిన అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారిణి బి.జ్యోతిపై తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తాయన్నారు. ఆ ఆరోపణల నేపథ్యంలో జాయింట్ డైరెక్టర్ తో విచారణ చేపట్టామన్నారు. ఆ విచారణలో జ్యోతిపై వచ్చిన ఆరోపణలు రుజువు కావడంతో, ఆమె విధుల నుంచి సస్పెండ్ చేయాలని ఆదేశించామన్నారు. ఆ ఆదేశాలకనుగుణంగా అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారిణి బి.జ్యోతిని సస్పెండ్ చేస్తూ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. జ్యోతి అక్రమాలను అడ్డుకట్ట వేయకుండా, పరోక్షంగా ఆమెకు సహకరించినట్లు జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారి అంజల దేవీని విధుల నుంచి రిలీవ్ చేస్తూ విజయవాడ హెడ్డాఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. తల్లిదండ్రుల స్థానంలో ఉండి బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన హాస్టల్ సిబ్బంది అక్రమాలకు పాల్పడడం బాధాకరమన్నారు.. ప్రభుత్వంపై నమ్మకంతో తల్లిదండ్రులు తమ బిడ్డలను హాస్టళ్లలో విడిచిపెట్టి వెలుతున్నారని, వారి నమ్మకాన్ని వమ్ము చేసేలా వ్యవహరించడం సరికాదన్నారు. సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం బీసీ బిడ్డలకు ఆహార, ఆరోగ్య భద్రతతో కూడిన విద్య అందిస్తోందన్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సవిత హెచ్చరించారు.

Comments

-Advertisement-