వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతతో సంపూర్ణ ఆరోగ్యం
వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతతో సంపూర్ణ ఆరోగ్యం
• నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్
కర్నూలు సిటీ, నవంబర్ 15 (పీపుల్స్ మోటివేషన్):-
వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచితేనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ అన్నారు. శనివారం స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల, టౌన్ మోడల్ పాఠశాల విద్యార్థులతో కలిసి కొండారెడ్డి బురుజు వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ముందుగా కళాశాల మైదానంలో విద్యార్థులతో శుభ్రత కార్యక్రమాలు చేపట్టి, అనంతరం ర్యాలీ ముగింపులో ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కమిషనర్ శుభ్రత అలవాట్లు చిన్నప్పటి నుంచే పెంచుకోవాలని, చెత్తను నిర్దేశిత ప్రదేశాల్లో వేయడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం వంటి మంచి చర్యలతో నగరం మరింత పరిశుభ్రంగా మారుతుందని అన్నారు. ప్రతి పౌరుడిలో బాధ్యతాయుతమైన ఆలోచన ఉండాలి, అప్పుడు మాత్రమే నగర అభివృద్ధి వేగంగా జరుగుతుందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ నాగశివ ప్రసాద్, శానిటేషన్ ఇంస్పెక్టర్ రమేష్, తదితరులు పాల్గొన్నారు.

