రహదారుల్లో ప్రమాదాలు జరుగకుండా నివారణ చర్యలు చేపట్టాలి
రహదారుల్లో ప్రమాదాలు జరుగకుండా నివారణ చర్యలు చేపట్టాలి
జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి
కర్నూలు, నవంబర్ 19: రహదారుల్లో ప్రమాదాలు జరుగకుండా నివారణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి అధికారులను ఆదేశించారు..
బుధవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం నిర్వహించారు..
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బ్లాక్ స్పాట్స్ గా గుర్తించిన రహదారి ప్రాంతాల్లో ప్రమాదాలు జరుగకుండా బ్యారికేడింగ్, రంబుల్ స్ట్రిప్స్, సైన్ బోర్డ్స్ లను నెల లోపు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆర్ అండ్ బి, నేషనల్ హై వే కర్నూలు,అనంతపురం, కడప ప్రాజెక్ట్ డైరెక్టర్లను ఆదేశించారు..అలాగే పోలీస్ శాఖ ప్రతిపాదించిన విధంగా ఆర్ అండ్ బి, నేషనల్ హై వేస్ కు సంబంధించిన రోడ్లలో అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని, 147 illuminations ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి రోడ్లలో బ్లైండ్ కర్వ్ లు ఉన్న చోట రెండు మూడు నెలలకు ఓసారి బుష్ క్లియరెన్స్ చేయాలని, అలాగే ఎండిపోయిన చెట్లను తొలగించాలని కలెక్టర్ ఎస్ ఈ లను ఆదేశించారు.. జాతీయ రహదారుల లో మీడియన్స్ నిర్వహణ సరిగ్గా లేదని, సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ నేషనల్ హై వే అధికారులను ఆదేశించారు.
ఎల్లమ్మ దేవాలయం దగ్గర జరుగుతున్న అప్రోచ్ రోడ్డు పనులను డిసెంబర్ 10 వ తేది లోపు పూర్తి చేసి హ్యాండోవర్ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పెద్దపాడు నుండి హైదరాబాద్ ఎన్హెచ్ కు లింక్ చేస్తూ ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు కు సంబంధించిన ప్రతిపాదనలను రివైజ్ చేసి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఆమోదం తీసుకుని ప్రభుత్వానికి పంపాలని కర్నూలు మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు..
ఆటోల్లో వెనుక వైపు ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ఈ అంశంపై ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇవ్వాలని కలెక్టర్ డి టి సి ని ఆదేశించారు.. ఉల్చాల, గాయత్రి ఎస్టేట్ జంక్షన్ అభివృద్ది పనులను త్వరితగతిన చేపట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. అలాగే నగరం లో జరుగుతున్న ఇతర సుందరీకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. కిడ్స్ వరల్డ్ నుండి కలెక్టరేట్ కాంప్లెక్స్ వరకు రోడ్ విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.
మోటర్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్ ద్వారా యాక్సిడెంట్ జరిగిన బాధితులకు ఏడు రోజులలోపు రూ. 1.5 లక్షల వరకు క్యాష్ లెస్ మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చే పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని, ఈ పథకం ద్వారా బాధితులకు సహాయం చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ట్రాన్స్పోర్ట్ డిటిసిని ఆదేశించారు..
రహ్- వీర్ పథకం కింద మోటర్ వెహికల్ ప్రమాదానికి గురైన బాధితులను గోల్డెన్ అవర్ లో ఏం వచ్చింది మెడికల్ కేర్ అందించి కాపాడిన వారికి గుడ్ సమరిటన్ గా అభినందిస్తూ రూ. 25 వేల వరకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని, ఈ అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ పిస్తా హౌస్ నుండి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వరకు ఇల్యూమినేషన్ పనులు వెంటనే చేయాలని హైవే, ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు..చ చిన్నటేకూరు వద్ద బస్సు ప్రమాదం జరిగిన చోట పగులగొట్టిన డివైడర్ ను వెంటనే నిర్మించాలని నేషనల్ హై వేస్ అధికారులను ఆదేశించారు..ఓర్వకల్లు రోడ్ లో రెండు కి.మీ యూ టర్న్ ఉన్నందున, ఎంత చెప్పినా ఆపోజిట్ లో వాహనాలు వస్తున్నాయని, ఆ అంశం మీద తగిన పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని తెలిపారు.
సమావేశంలో ఆర్ అండ్ బి ఎస్ఈ మహేశ్వర రెడ్డి, కర్నూల్ మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ, డిటిసి శాంత కుమారి, నేషనల్ హై వే ప్రాజెక్ట్ డైరెక్టర్ లు, పంచాయతీ రాజ్ ఎస్ ఈ వేణుగోపాల్, ఆర్టీసీ ఆర్ ఎం శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు..

