‘డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్’ పురస్కారం పొందిన భువనేశ్వరి
‘డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్’ పురస్కారం పొందిన భువనేశ్వరి
– అభినందించిన ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్
అమరావతి, 5 నవంబర్ (పీపుల్స్ మోటివేషన్ ):
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్, హెరిటేజ్ ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ‘డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్’ అనే ప్రతిష్టాత్మక గౌరవాన్ని అందుకున్న సందర్భంగా అభినందనలు తెలిపారు. మహిళా సాధికారత, విద్య, ఆరోగ్య రంగాల్లో సేవలందిస్తున్న భువనేశ్వరి చేస్తున్న కృషి దేశానికి ఆదర్శమని గవర్నర్ పేర్కొన్నారు.
ఈ అవార్డు ద్వారా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా జరుగుతున్న శిక్షణా కార్యక్రమాలు, అనాధ విద్యార్థులకు అందిస్తున్న విద్యా సేవలు, వైద్య సేవలు, విపత్తు సమయంలో ఆహార–పానీయాల పంపిణీ, మహిళల కోసం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు జాతీయస్థాయిలో గుర్తింపు పొందినట్లు గవర్నర్ అభిప్రాయపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యను ప్రోత్సహించడం, యువతకు ఉద్యోగావకాశాల కోసం శిక్షణలు ఇవ్వడం వంటి సేవా కార్యక్రమాల ద్వారా ఎన్నో కుటుంబాలకు భువనేశ్వరి వెలుగునిచ్చారని అన్నారు.
సమాజసేవతో పాటు వ్యాపార రంగంలోనూ ఆదర్శప్రద నాయకత్వం కనబరుస్తూ హెరిటేజ్ ఫుడ్స్‌ను దేశవ్యాప్తంగా విస్తరింపజేసిన భువనేశ్వరి ప్రయాణం నేటి మహిళలకు ప్రేరణ అని నజీర్ పేర్కొన్నారు. సేవాభావం, నిజాయితీ, క్రమశిక్షణతో ప్రజలకు శ్రేయస్సు కలిగించాలనే లక్ష్యంతో భువనేశ్వరి పనిచేస్తున్న తీరు ప్రశంసనీయమని అన్నారు.
భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ గుర్తింపులు అందుకొని రాష్ట్ర గర్వాన్ని మరింత పెంచాలని గవర్నర్ ఆకాంక్షించారు.
