రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

యూసుఫ్‌గూడాలో సన్న బియ్యం లబ్ధిదారుల ఇంట భోజనం చేసిన పొన్నం ప్రభాకర్

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

హైదరాబాద్, నవంబర్ 5 (పీపుల్స్ మోటివేషన్): జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రచారం వేగం పెంచింది. యూసుఫ్‌గూడా డివిజన్‌లోని శ్రీ‌కృష్ణ నగర్‌లో పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా ప్రచార కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. స్థానిక నాయకులతో కలిసి పిల్లి పద్మ ఆంజనేయులు యాదవ్ నివాసంలో సన్న బియ్యం లబ్ధిదారుల కుటుంబంతో భోజనం చేశారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ప్రభుత్వమే అందిస్తున్న సన్న బియ్యం పథకం పేద కుటుంబాలకు ఆశ్రయంగా మారిందని పేర్కొన్నారు. ప్రజల ఇళ్లలో భోజనం చేయడం ద్వారా వారి సమస్యలు, అవసరాలు, ప్రభుత్వ పథకాలపై అభిప్రాయాలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం లక్ష్యమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్య ప్రజల పక్షంలో నిలబడి సంక్షేమ పథకాల్ని మరింత బలోపేతం చేస్తుందని హామీ ఇచ్చారు. ప్రచారంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

-Advertisement-