లింగ వివక్షత పై విస్తృత ప్రచారం కల్పించాలి
లింగ వివక్షత పై విస్తృత ప్రచారం కల్పించాలి
- పురుషులతో సమానంగా మహిళాభివృద్ధే లక్ష్యం
- గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ సీఈవో వాకాటి కరుణ
లింగ ఆధారిత వివక్షపై పోరాటం, స్త్రీ, పురుష సమానత్వం ఆవశ్యకతపై పౌరుల్లో అవగాహన పెంచడం నయీ చేతన జాతీయ జెండర్ క్యాంపైన్ ను 4.0 ముఖ్య ఉద్దేశ్యం అని గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ సీఈవో వాకాటి కరుణ తెలిపారు.
మంగళవారం సెర్ప్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ సీఈవో వాకాటి కరుణ మాట్లాడుతూ... కుటుంబం, సమాజం లో మహిళలు పోషించే పాత్ర అద్వితీయమైనదని నేడు అన్ని రంగాల్లో మహిళలు ప్రగతి పధం లో కొనసాగుతున్నారన్నారు. అయినా కొన్ని సందర్భాల్లో మహిళల పట్ల వివక్ష కొనసాగుతోందని, ఈ వివక్షను తగ్గించడం లేదా పూర్తిగా రూపు మాపటానికి సమాజం లోని ప్రతి ఒక్కరూ ముఖ్యంగా పురుషులు ముందుకు రావాలని తెలిపారు.
కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (MoRD, Gol) జెండర్ అసమానత్వ సమస్యలు ఎదుర్కొనేందుకు నిర్మాణాత్మక వ్యూహాలను అమలు చేసేందుకు DAY-NRLM (దీన్ దయాళ్ అంత్యోదయ యోజన-నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్)/AP SERP స్వయం సహాయక సంఘాలు, ఇతర ప్రభుత్వ విభాగాలు, వివిధ స్వచ్చంద సంస్థలు/పౌర సమాజ సంస్థలు (సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్) అనుసంధానంతో చేపట్టారన్నారు. నేటి నుండి 23 డిశంబర్ 2025 వరకు అన్ని జిల్లాల్లో జెండర్ వివక్షతకు వ్యతిరేకంగా (National Campaign Against Gender based Discrimination) విస్తృత ప్రచారం చేయాలన్నారు. సెర్ప్ కు సంబంధించిన 26 జిల్లాల జిల్లా పథక సంచాలకులు, జిల్లా సమాఖ్యలు, హెచ్.డి విభాగాలు వారు ఇందులో పాల్గొనాలన్నారు. నయీ చేతన 4.0 జెండర్ క్యాంపైన్ ఉద్దేశ్యం వివరించటంతోపాటు 4 వారాల పాటు చేయవలసిన అంశాలను వివరించారు. సమ్మిళిత వృద్ధి కోసం ఆర్థిక సాధికారతకు వికసిత గ్రామీణ భారత్ కు మహిళలు అనే థీమ్ చేపట్టారన్నారు. ముందుగా కరుణ వాకటి నయీ చేతన 4.0 జెండర్ క్యాంపైన్ ఉద్దేశ్యాన్ని, 4 వారాల పాటు చేయవలసిన అంశాలను వివరించారు. తొలుత నయీ చేతన 4.0 జెండర్ క్యాంపైన్ ప్రచార పోస్టర్లను, ప్రచార సామాగ్రిని ఆవిష్కరించారు. కార్యక్రమ నిర్వహణకు సంబంధించి జిల్లాకు రూ. 5000/- చొప్పున 660 మండలాకు రూ.4000/- చొప్పున బడ్జెట్ ను విడుదల చేయటం జరిగిందన్నారు.
మానవాభివృద్ధి విభాగం డైరెక్టర్ డా. వి. శివశంకర ప్రసాద్ మాట్లాడుతూ నాలుగు వారాలపాటు నిర్వహించే కార్యక్రమంలో వివిథ రకాల థీమ్స్ ద్వారా ప్రజలకి అవగాహన కల్పిస్తామన్నారు. స్వేచ్ఛ ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు.
ప్రారంభోత్సవ కార్యక్రమములో అన్ని జిల్లాల పధక సంచాలకులు, జిల్లా స్థాయి సిబ్బంది మండల, గ్రామ స్థాయి వరకు వర్చ్యువల్ పద్దతిలో పాల్గొన్నారు.
కార్యక్రమంలో సెర్ప్ అడిషనల్ సీఈవో ఎన్. శ్రీరాములు నాయుడు, డైరెక్టర్లు పి. సుశీల, బి. కృష్ణ మోహన్, ఏ. కళ్యాణ చక్రవర్తి, ఎస్ .జె . దీపక్, సోమయాజులు, స్త్రీనిధి జెనరల్ మేనేజర్ సిద్ది శ్రీనివాస్ రావు, అదనపు డైరెక్టర్ లు , ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ లు, సెర్ప్ సిబ్బంది, స్త్రీ నిధి సిబ్బంది, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.
