పాఠశాల విద్యార్థులచే శాసనసభ నమూనా సమావేశం
పాఠశాల విద్యార్థులచే శాసనసభ నమూనా సమావేశం
అమరావతి, నవంబర్ 25 : భారత రాజ్యాంగ దినోత్సవం – 2025 ను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో “పాఠశాల విద్యార్థులచే శాసనసభ నమూనా సమావేశం (Students Mock Drill Assembly)” కార్యక్రమం ఈ నెల 26 వ తేదీ బుధవారం ఉదయం 9.00 గంటలకు అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రాంగణంలో నిర్వహించబడుచున్నది. పాఠశాల విద్యార్థుల్లో రాజ్యాంగ పట్ల గౌరవం, భారత ప్రజాస్వామ్య వ్యవస్థ, శాసనసభా ప్రక్రియలు మరియు ప్రజా ప్రతినిధుల పాత్రలపై అవగాహన కల్పించడంతో పాటు నాయకత్వ లక్షణాలను, నైపుణ్యాలను పెంపొందించడమే ముఖ్య లక్ష్యం ఈ “మాక్ డ్రిల్ అసెంబ్లీ” నిర్వహించడం జరుగుచున్నది.
రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్, ఆర్టీజీ శాఖల మంత్రివర్యులు నారా లోకేష్ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు సమాచార శాఖ సహాయ మంత్రివర్యులు డా|| పెమ్మసాని చంద్రశేఖర్, ఉప ముఖ్యమంత్రి వర్యులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణం, అటవీ శాఖ మరియు సైన్స్ & టెక్నాలజీ శాఖల మంత్రివర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక & సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు మరియు గుంటూరు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కందుల దుర్గేష్ విశిష్ట అతిథులుగా హాజరుకానున్నారు.
రాష్ట్ర మంత్రులు మరియు విద్యార్థుల నీతి మరియు విలువలు సలహాదారులు చాగంటి కోటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్, మయాన జకీయా ఖానమ్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు, చీఫ్ విప్‌లు & విప్‌లు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్లు, మేయర్లు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, కార్పొరేషన్ చైర్‌పర్సన్లు, గ్రంథాలయ సంస్థ & ఇతర ప్రజా ప్రతినిధులు అతిథులు గా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు.
అదే విధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర, పాఠశాల విద్య, ఉన్నత విద్య మరియు నైపుణ్యాభివృద్ధి శాఖ కార్యదర్శి కోన శశిధర్, పాఠశాల విద్య శాఖ డైరెక్టర్ విజయ్ రామ రాజు వి, గుంటూరు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్
ఎ. తమీమ్ అన్సారియా మరియు సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు ప్రత్యేక అతిథులుగా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు.
