రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

దేశభక్తి స్ఫూర్తి మంత్రం.. 'వందేమాతరం'

PM Modi Vande Mataram National Anthem 150th Anniversary Bankim Chandra Chatterjee India Independence Movement Gajendra Singh Shekhawat
Mounikadesk

దేశభక్తి స్ఫూర్తి మంత్రం.. 'వందేమాతరం'

వందేమాతరం గేయ 150వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా.. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సామూహిక గేయాలాపన కార్యక్రమం 

కడప, నవంబర్ 7: యావత్ భారతావనిలో దేశభక్తిని నింపే స్ఫూర్తి మంత్రం వందేమాతర గేయం అని జిల్లా ఇంచార్జి రెవెన్యూ అధికారి వెంకటపతి పేర్కొన్నారు.

వందేమాతరం గేయ రచన చేసి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా.. జిల్లా కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాలులో శుక్రవారం 'వందేమాతరం' సామూహిక గేయాలాపన కార్యక్రమం నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా ఇంచార్జి రెవెన్యూ అధికారి వెంకటపతి తోపాటు.. గురుకుల విద్యాలయాల జిల్లా కో ఆర్డినేటర్ ఉదయశ్రీ హాజరయ్యారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహాకవి బంకిమ్ చంద్ర చటర్జీ రచించిన వందేమాతరం గీతం స్వాతంత్య్ర ఉద్యమంలో కాలంలో.. కోట్లాది మంది భారతీయుల్లో దేశభక్తి స్ఫూర్తి నింపిందన్నారు. ఇప్పటికీ దేశ వ్యాప్తంగా అదే గీతాన్ని ప్రతి విద్యాలయాల్లో ప్రథనా గీతంగా అలపిస్తున్నారన్నారు. వందేమాతరం అనేది మన దేశం పట్ల ఉన్న గౌరవం, ప్రేమ, మరియు సేవాస్ఫూర్తికి ప్రతీక అన్నారు. దేశ భక్తిని, జాతీయ స్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అంతా ఏకమై వందేమాతరం గీతాన్ని ఆలపించారు. ఈ దేశభక్తి గీతం ఉద్యోగుల్లో కూడా జాతీయత భావాన్ని, ఐక్యతను మరింత పెంపొందిస్తుందని కొనియాడారు. ఈ సందర్భంగా భారత్ మాతా కి జై ...అంటూ పోలీస్ అధికారులు, సిబ్బంది నినదించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపధికల్పన అధికారి సురేష్ కుమార్, ఏ.ఓ. విజయ్ కుమార్, కలెక్టరేట్ లోని వివిధ సెక్షన్ల సూపరిన్టెండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

-Advertisement-