రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీకి జనసేన పూర్తి మద్దతు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

 జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీకి జనసేన పూర్తి మద్దతు
General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

హైదరాబాద్, నవంబర్ 5 (పీపుల్స్ మోటివేషన్): జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీకి తమ పార్టీ సంపూర్ణ మద్దతు అందిస్తున్నట్లు జనసేన ప్రకటించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులు బీజేపీ అభ్యర్థి విజయం కోసం క్షేత్రస్థాయిలో పనిచేస్తాయని జనసేన రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్ తెలిపారు. సమస్యల సమయంలో ప్రజలకు అండగా నిలుస్తుంది బీజేపీయేనని, అవినీతి రహిత పార్టీగా బీజేపీ ప్రజల్లో నమ్మకం పొందిందని శంకర్ గౌడ్ పేర్కొన్నారు. జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి గెలుపుకు జనసేన శక్తివంతంగా ప్రచారం నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. ఈ ప్రకటనతో హైదరాబాదు రాజకీయ సమీకరణాల్లో మార్పులు సంభవించే సూచనలు కనిపిస్తున్నాయి. జూబ్లిహిల్స్‌లో బీజేపీ–జనసేన కూటమి ప్రచార వేడి పెంచే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Comments

-Advertisement-