రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

పాక్‌లో తీవ్ర నిరుద్యోగం…

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

 పాక్‌లో తీవ్ర నిరుద్యోగం… 

- మూడు వంతుల యువతకు ఉపాధి కరవుతో ఆందోళన

- విద్యా–నైపుణ్యాల మధ్య భారీ ఖాళీ

- నిరుద్యోగం – నేరాలు, తీవ్రవాదం వైపు మళ్లుతున్న యువత

ఇస్లామాబాద్, నవంబర్ 5 (పీపుల్స్ మోటివేషన్): పాకిస్థాన్‌లో నిరుద్యోగం భయానక స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా యువతలో పరిస్థితి మరింత దిగ్భ్రాంతికరంగా మారింది. దేశ జనాభాలో 15 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న యువతలో దాదాపు మూడింట ఒక వంతు మంది ఉపాధి లేక ఖాళీగా ఉన్నారని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. దేశంలో తొలిసారిగా నిర్వహించిన డిజిటల్ జనగణన ప్రకారం, పాకిస్థాన్‌లో మొత్తం నిరుద్యోగ రేటు 7.8 శాతంగా నమోదైంది. అంటే 24.15 కోట్ల జనాభాలో సుమారు 1.87 కోట్ల మందికి ఉపాధి లభించకపోవటం ఆందోళన కలిగిస్తోంది. నిరుద్యోగ సమస్య కనిపించే దానికంటే చాలా లోతుగా ఉన్నదని నిపుణులు అంచనా వేస్తున్నారు. చదువు పూర్తిచేసుకున్నా, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు అందించడంలో విద్యా వ్యవస్థ విఫలమవుతుండటం పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తోంది. యువతకు శిక్షణ, నైపుణ్యవృద్ధి అవకాశాలు లేకపోవడం ఉపాధి మార్కెట్లో పోటీ చేయడాన్ని కష్టతరం చేసింది. దేశంలో మహిళల ఉద్యోగ భాగస్వామ్యం కూడా ప్రపంచంలోనే అత్యల్పంగా ఉండటం సమస్యను మరింత పెంచుతోంది.

- ఆర్థిక సంక్షోభం – ఉద్యోగాల కరువు
General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

ఇటీవలి వరదలు, ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం, విదేశీ మారక నిల్వల తీవ్ర కొరత పాకిస్థాన్ ఉద్యోగ రంగాన్ని దెబ్బతీశాయి. 2022, 2025లో సంభవించిన వరదలు వ్యవసాయం, చిన్నతరహా వ్యాపారాలు, స్థానిక మార్కెట్లను కుదేలు చేశాయి. భారీ పన్నులు, ద్రవ్యోల్బణం, ఇంధన ధరల పెరుగుదల కారణంగా వేలాది చిన్న వ్యాపారాలు మూతపడ్డాయి. ఫలితంగా లక్షలాది మంది పేదరికంలోకి దిగజారినట్లు ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది.

- నిరుద్యోగం – నేరాలు, తీవ్రవాదం వైపు మళ్లుతున్న యువత
General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

ఉపాధి లేకపోవడం దేశ భద్రత, సామాజిక స్థిరత్వానికి ముప్పుగా మారుతోంది. ఉద్యోగం దొరకకపోవడంతో పలువురు యువకులు పేదరికం నుంచి బయటపడేందుకు నేరాలకు పాల్పడుతున్న ఘటనలు పెరిగాయి. బలూచిస్థాన్ బొగ్గు గనుల్లో కార్మికుల మరణాలు, పట్టణాల్లో గన్‌పాయింట్ దోపిడీలు, వీధి నేరాలు పెరుగుతున్నాయి. కొంతమంది యువత మదర్సాలు, సోషల్ మీడియా వేదికల ద్వారా తీవ్రవాద భావజాలం వైపు మళ్లుతున్నారని, ఇది పాకిస్థాన్‌కు భద్రతా పరంగా భారీ సవాలుగా మారుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Comments

-Advertisement-