World Cup: వరల్డ్ కప్ టీమ్’లో ఆ నలుగురు.. ఓపెనర్‌గా మంధాన..!
world cup final women 2025
Women's world cup details
Women's World Cup news
India world cup news
Latest cricket updates
Latest Cricbuzz news live news
By
Peoples Motivation
World Cup: వరల్డ్ కప్ టీమ్’లో ఆ నలుగురు.. ఓపెనర్‌గా మంధాన..!
ముంబై, నవంబర్ 3 (పీపుల్స్ మోటివేషన్):-వన్డే ప్రపంచకప్‌లో తడబాటు నుంచి గొప్పగా పుంజుకొన్న భారత జట్టు ఛాంపియన్‌గా అవతరించింది. భావి తరాలకు స్ఫూర్తినిచ్చే విజయంతో మహిళా క్రికెట్ చరిత్రలో కొత్త చరిత్రను సృష్టించింది. దశాబ్దాల కలను సాకారం చేసుకునేందుకు మైదానంలో సర్వశక్తులు ఒడ్డిన హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం.. విజయంతో మెగా టోర్నీకి వీడ్కోలు పలికింది. ఈ పదమూడో సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేసిన నలుగురు భారత క్రికెటర్లు వరల్డ్ కప్ టీమ్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ లో చోటు దక్కించుకున్నారు.
క్రీడాభిమానులను అలరించిన వన్డే ప్రపంచకప్ ముగియడంతో ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో జట్టును ప్రకటించింది. ఇందులో భారత్ నుంచి నలుగురు, రన్నరప్ దక్షిణాఫ్రికా జట్టు నుంచి ముగ్గురు ఎంపికవ్వగా.. ఆస్ట్రేలియా జట్టులోని ముగ్గురు, ఇంగ్లండ్ నుంచి ఒకరికి చోటు లభించింది. టీమిండియా టీమిండియా విజేతగా నిలవడంలో కీలకమైన స్మృతి మంధాన ఓపెనర్‌గా, మిడిలార్డర్ బ్యాటర్‌గా జెమీమా రోడ్రిగ్స్, వికెట్ కీపర్‌గా రీచా ఘోష్.. స్పిన్ ఆల్‌రౌండర్‌గా దీప్తి శర్మలు ఎంపికయ్యారు.మెగా టోర్నీలో నాకౌట్స్‌లో శతకాలతో రెచ్చిపోయిన లారా వొల్వార్డ్త్ కెప్టెన్, ఓపెనర్‌గా సెలెక్ట్ అయింది. రెండు సెంచరీలు బాదిన అష్ గార్డ్‌నర్, సథర్‌లాండ్, అలనా కింగ్(ఆస్ట్రేలియా), సోఫీ ఎకిల్‌స్టోన్(ఇంగ్లండ్)లు తుది జట్టులో నిలిచారు. వరల్డ్ కప్‌తో వన్డేలకు వీడ్కోలు పలికిన న్యూజిలాండ్ కెప్టెన్ సోఫీ డెవినె పన్నెండో ప్లేయర్‌గా ఎంపికైంది. వన్డే వరల్డ్ కప్ టీమ్: స్మృతి మంధాన, లారా వొల్వార్డ్త్(కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, మరిజానే కాప్, అనబెల్ సథర్‌లాండ్, అష్ గార్డ్‌నర్, రీచా ఘోష్(వికెట్ కీపర్), నడినే డీక్లెర్క్, దీప్తి శర్మ, అలనా కింగ్, సోఫీ ఎకిల్‌స్టోన్. 12వ ప్లేయర్ – సోఫీ డెవినె.
Comments

