పదవ తరగతిలో వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను పటిష్టంగా అమలు చేయాలి
పదవ తరగతిలో వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను పటిష్టంగా అమలు చేయాలి
డ్రాప్ అవుట్ లు ఉండకూడదు
మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనాన్ని అందించాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి
కర్నూలు, డిసెంబర్ 23 (పీపుల్స్ మోటివేషన్):- పదవ తరగతి లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను పటిష్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి సంబంధిత విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులను ఆదేశించారు.
మంగళవారం మంత్రాలయం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులతో ముచ్చటించారు..మధ్యాహ్న భోజనం రుచి చూసి నాణ్యతను పరిశీలించారు..
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పదవ తరగతి లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారని ఆరా తీశారు.. మొత్తం 918 మంది పదవ తరగతి విద్యార్థులు చదువుతుండగా, 24 మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అయినట్లు ఉపాధ్యాయులు కలెక్టర్ కు వివరించారు. వలస వెళ్లిన 24 మంది విద్యార్థులను తిరిగి పాఠశాలల్లో చేర్పించి, వారు తప్పనిసరిగా పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని కలెక్టర్ స్పష్టం చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం పదవ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత కోసం రూపొందించిన “వంద రోజుల ప్రణాళిక” అమలుపై కలెక్టర్ ప్రత్యేకంగా సమీక్షించారు. ప్రతిరోజూ సబ్జెక్ట్ వారీగా పాఠ్యాంశాలను బోధిస్తున్నారా, రోజువారీ పరీక్షలు నిర్వహించి వాటి ఫలితాలను సాయంత్రం లోపు సంబంధిత పోర్టల్‌లో అప్లోడ్ చేస్తున్నారా అని కలెక్టర్ సవివరంగా పరిశీలించారు. విద్యార్థుల్లో అభ్యసన లోపాలను గుర్తించి, వెంటనే పరిష్కరించేలా కృషి చేయాలని కలెక్టర్ ఉపాధ్యాయులను ఆదేశించారు.. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ, విద్యార్థి దశలోనే స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరుచుకుని, దానికి అనుగుణంగా రోజువారీ క్రమశిక్షణతో సాధన చేయాలని కలెక్టర్ సూచించారు. కష్టపడి చదివితే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని పేర్కొంటూ, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని విద్యార్థులకు ప్రేరణ కలిగించారు.
విద్యార్థులకు మెనూ ప్రకారం రుచికరమైన భోజనం తప్పనిసరిగా అందించాలి
విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం రుచికరమైన, పోషక విలువలు కలిగిన మధ్యాహ్న భోజనాన్ని నాణ్యతతో అందించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.భోజన పథకం అమలులో ఎలాంటి నిర్లక్ష్యం జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని కలెక్టర్ రుచి చూసి పరిశీలించారు. రోజుకు ఎంత మంది విద్యార్థులకు భోజనం తయారు చేస్తున్నారని ప్రశ్నించగా, సుమారు వెయ్యి మంది విద్యార్థులకు ప్రతిరోజూ మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా అంతే పరిమాణంలో విద్యార్థులకు భోజనాన్ని అందించాలని తప్పనిసరిగా కలెక్టర్ స్పష్టం చేశారు. భోజనం తయారీ సమయంలో పరిశుభ్రత, నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. వంటశాలలు శుభ్రంగా ఉండాలని, వంట పాత్రలు శుభ్రపరచాలని, తాగునీరు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వంట సిబ్బందిని ఆదేశించారు.
కార్యక్రమంలో , హౌసింగ్ పిడి చిరంజీవి, మంత్రాలయం నియోజకవర్గ మండల స్పెషల్ అధికారి/ డి పి ఓ భాస్కర్, మంత్రాలయం టీడీపీ ఇంచార్జి రాఘవేంద్ర రెడ్డి, ఆదోని ఆర్డీఓ కార్యాలయం పరిపాలన అధికారి వసుంధర దేవి, మంత్రాలయం తహసిల్దార్ రమాదేవి, ఎంపిడిఓ నూర్జహాన్, ఎంఈఓ రాగన్న, మొహిద్దిన్,
తదితరులు పాల్గొన్నారు.
