నంద్యాలలో మెగా జాబ్ మేళా ను ప్రారంభం
నంద్యాలలో మెగా జాబ్ మేళా ను ప్రారంభం
-తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు ఎన్ఎండి ఫయాజ్
నంద్యాల, డిసెంబర్ 23 (పీపుల్స్ మోటివేషన్):- నంద్యాల స్థానిక నేషనల్ డిగ్రీ కాలేజ్ నందు ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ నంద్యాల జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు ముఖ్యఅతిథిలుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్, నేషనల్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఇంతియా అహ్మద్ పాల్గొని గ్రామీణ , పట్టణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతీ , యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా నంద్యాలలో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని తెలిపి ఎన్ఎండి ఫయాజ్ జాబ్ మేళాను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ "ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగ అవకాశాలు తలుపు తట్టినప్పుడు వాటిని వదులుకోకూడదని . నిరుద్యోగ యువతకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఒకే వేదికపైకి ఇన్ని బహుళజాతి కంపెనీలను తీసుకురావడం అభినందనీయని . యువత తమలో ఉన్న ప్రతిభను గుర్తించి, ఆత్మవిశ్వాసంతో ఇంటర్వ్యూలను ఎదుర్కోవాలన్నారు". "కేవలం డిగ్రీ పట్టాలు ఉంటే సరిపోదని, మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా నైపుణ్యాలను (స్కిల్స్) మెరుగుపరుచుకోవాలన్నార. నిరంతరం నేర్చుకునే తత్వం ఉన్నవారికే కార్పొరేట్ రంగంలో మంచి గుర్తింపు లభిస్తుందని . స్థానిక యువతకు స్థానికంగానే ఉపాధి కల్పించడమే ఈ మేళా యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు. ప్రతి విద్యార్థి ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని . ఈరోజు చిన్న ఉద్యోగంలో చేరినప్పటికీ, నిరంతర కృషి, పట్టుదలతో పని చేస్తే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించడం సాధ్యమవుతుందన్నారు. యువత తమ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తూ సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ ప్రతినిధులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ మెగా జాబ్ మేళాలో దాదాపు 22 కంపెనీలు 2100 ఉద్యోగాలకు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించాయన్నారు
ఈ సందర్భంగా డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ తమ కళాశాల వేదికగా ఇటువంటి బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. చదువుకున్న ప్రతి యువకుడికి, యువతికి ఒక గౌరవప్రదమైన ఉద్యోగం లభించాలనేది మా ఆశయమని అందుకే విద్యార్థుల ముంగిటకే ఉద్యోగ అవకాశాలను తీసుకురావాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థతో ఈ 'మెగా జాబ్ మేళా'ను ఏర్పాటు చేశామన్నారు . నంద్యాల జిల్లాలోని యువతలో అద్భుతమైన తెలివితేటలు ఉన్నాయని. సరైన వేదిక దొరికితే వారు ప్రపంచ స్థాయిలో రాణించగలరన్నారు . ఇంటర్వ్యూలలో పాల్గొనే అభ్యర్థులు ఆత్మవిశ్వాసంతో వ్యవహరించాలని . ఒక్కసారి అవకాశం రాకపోయినా నిరాశ చెందకుండా, మనలో ఉన్న లోపాలను సరిదిద్దుకుని ముందుకు సాగాలన్నారు . నేషనల్ విద్యాసంస్థలు కేవలం నాణ్యమైన విద్యకే కాకుండా, విద్యార్థుల కెరీర్ గైడెన్స్ మరియు ప్లేస్‌మెంట్స్ విషయంలో కూడా ఎప్పుడూ ముందుంటాయన్నారు
ఈ కార్యక్రమంలో జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శేషన్న, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మునియార్ ఖలీల్, దూదేకుల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దస్తగిరి, నంద్యాల మార్కెట్ యార్డ్ డైరెక్టర్ స్వామి నాయక్, కామిని మల్లికార్జున, దీపక్ రెడ్డి, నేషనల్ విద్యాసంస్థల సెక్రటరీ రఫీ అహ్మద్ , నేషనల్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ వేణుగోపాల్, ప్లేస్మెంట్ అధికారి సాయికుమార్, మస్తాన్ వలి, మారుతి ప్రసాద్, కళాశాల అధ్యాపక బృందం , టిడిపి నాయకులు మరియు పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొన్నారు.

