ఇంటి నిర్మాణాల పై ప్రత్యేక దృష్టి సారించి వాటిని పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టండి
ఇంటి నిర్మాణాల పై ప్రత్యేక దృష్టి సారించి వాటిని పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టండి
- జిల్లా కలెక్టర్ డా.ఏ.సి
మంగళవారం కోసిగి మండల కేంద్రంలోని గ్రామ సచివాలయం - 4 ను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హౌసింగ్ కి సంబంధించి రూఫ్ లెవెల్, రూఫ్ కాస్ట్ స్థాయిలో ఉన్న ఇళ్ల నిర్మాణాల లబ్ధిదారులతో మాట్లాడి వారిని మోటివేషన్ చేసి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ను ఆదేశించారు.. అదే విధంగా కోసిగి మండల కేంద్రంలో ఉన్న హౌసింగ్ లే ఔట్ లో అని మౌలిక సదుపాయాలు ఉన్నాయా అని కలెక్టర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ను అడిగి తెలుసుకున్నారు.. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి తనిఖీలు చేసే సమయంలో ఎటువంటి సమస్యలు గుర్తిస్తున్నారు, పారిశుధ్యం ఏ విధంగా ఉంది, మధ్యాహ్న భోజనం ఏ విధంగా ఉంటోంది అని కలెక్టర్ సచివాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు..
బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాల గురించి పిల్లల తల్లి తండ్రులకి, పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ మహిళా పోలీసు ని ఆదేశించారు.. అదే విధంగా మంచి స్పర్శ, చెడు స్పర్శ, వ్యక్తిగత పరిశుభ్రతమీద కూడా అవగాహన కల్పించాలని కలెక్టర్ మహిళా పోలీసు ని ఆదేశించారు.. విద్యార్థులతో ఫ్రెండ్లీ గా ఉండాలని, వారికి ఏ సమస్య ఉన్నా మీ దగ్గరికి వచ్చి చెప్పే విధంగా వారితో సన్నిహితంగా ఉండాలని కలెక్టర్ మహిళా పోలీసు కు సూచించారు.. ప్రతి రోజు సర్వీస్ లకు సంబంధించి ఎన్ని దరఖాస్తులు వస్తున్నాయని కలెక్టర్ డిజిటల్ అసిస్టెంట్ ని అడిగి తెలుసుకున్నారు.. ఐవిఆర్ఎస్ ఫీడ్ బ్యాక్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు..
హౌస్ ట్యాక్స్ కలెక్షన్ పై ప్రజల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ పంచాయతీ కార్యదర్శి ని ఆదేశించారు.. చెత్త సేకరణ ప్రతి రోజు కలెక్ట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, అదే విధంగా వీధి దీపాలు వెలిగే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పంచాయతీ కార్యదర్శి ని ఆదేశించారు...త్రాగునీటి సరఫరా లో ఎటువంటి సమస్య లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారిని ఆదేశించారు.. పైప్ లైన్, మోటార్ మరమ్మతులు ఏమైనా ఉంటే వెంటనే చేయించాలన్నారు..
ముందుగా కోసిగి మండలంలోని చింతకుంట గ్రామములో ఇంటి–ఇంటి చెత్త సేకరణ, త్రాగునీరు, వీధి దీపాల సదుపాయాలపై కలెక్టర్ ప్రజలతో సంభాషించారు.. వారానికి ఎన్ని రోజులు చెత్త సేకరణ కోసం పారిశుధ్య సిబ్బంది వస్తున్నారని, పెన్షన్ ఇచ్చే సమయంలో సచివాలయ సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారా అని ఆరా తీశారు.. ప్రతి రోజు చెత్త సేకరణ కొరకు పారిశుధ్య సిబ్బంది వస్తున్నారని, పెన్షన్ ఇచ్చే సమయంలో సచివాలయ సిబ్బంది డబ్బులు వసూలు చేయడం లేదని ప్రజలు కలెక్టర్ కు వివరించారు..
అంగన్వాడీ కేంద్రం నిర్మాణం పూర్తి అయ్యే దశలో ఉందని సంబంధిత కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొని వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, ఇంటి పట్టాలు కావాలని ప్రజలు కలెక్టర్ దృష్టికి తీసుకొని రాగా వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
కార్యక్రమంలో హౌసింగ్ పిడి చిరంజీవి, డీపీఓ భాస్కర్, కోసిగి తహసిల్దార్ వేణుగోపాల్ శర్మ, తదితరులు పాల్గొన్నారు.

