ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ
ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ
అన్నమో రామచంద్రా' అన్నవారి ఆకలి తీర్చిన మహా ఇల్లాలు
కాకినాడ (పీపుల్స్ మోటివేషన్):- తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో నిత్యాన్నదాతగానూ అన్నపూర్ణ గానూ ప్రసిద్ధి చెందిన వ్యక్తి డొక్కా సీతమ్మ. గోదావరి లంకల గన్నవరం అని పిలువబడే ఊరిలో ఇల్లాలుగా ప్రవేశించిన ఈమె ఆ ప్రాంతములలో తరచూ వచ్చే వరద కారణంగా అతివృష్టి, అనావృష్టి ల కారణంగానూ పలు ఇబ్బందులకు గురయ్యే ఆ ప్రాంత గ్రామాల పేదలను ఆదుకొంటూ, వచ్చిన వారికి లేదనకుండా నిత్యాన్నదానం జరిపిన మహాఇల్లాలు. 'అన్నమో రామచంద్రా' అన్నవారి ఆకలి తీర్చిన మహా ఇల్లాలు. ఈమె చదువుసంధ్యలు లేని సాధారణ స్త్రీ. ఆమె తాను అన్నదానంచేసి, విశ్వమానవతకు అద్దం పట్టిన మహిళామణి . భారతీయ సాంప్రదాయంలో 'అన్నం పరబ్రహ్మ స్వరూపమ్ ' అని పేర్కొనడం మనం వింటున్నాం. అన్నదానానికి మించిన దానంలేదని విశ్వసించి, ఆకలిగొన్న వారికి అన్నం పెట్టడమే ధ్యేయంగా 'అతిథి దేవోభవ' అన్నపదానికి ఉదాహరణగా నిలిచినవ్యక్తి ఆమె .
డొక్కా సీతమ్మ తమ ఇంటికి ఎంతమంది వచ్చినా వారికి కడుపు నిండుగా భోజనం పెట్టె వారుట. ఆ రోజుల్లో బ్రిటిష్ రాణి ఈవిడ గారి గుంరించి విని తన పట్టాభిషేకం సమయానికి డొక్క సీతమ్మ ను తీసుకు వెళ్లాలని అలోచించారు. కానీ సీతమ్మ సముద్రం దాటి వెళ్ళరు కనుక, గోదావరి జిల్లా కలెక్టర్ ను సీతమ్మ గ్రామానికి పంపి, ఆమె ఫోటో లండన్ పంప మని కలెక్టర్ ని ఆదేశించారు. కలెక్టర్ సీతమ్మ వద్దకు వెళ్లి ఆమె ఫోటో కోసం అడిగితే వల్ల కాదన్నారు ఆమె.అప్పుడు కలెక్టర్ ఆవిడ కాళ్ళ వెళ్ళా పడి, అమ్మా మీరు నాకు ఫోటో ఇవ్వకపోతే నా వుద్యోగం ఊడుతుందని చెప్పటంతో సీతమ్మ ఫోటో తీయించుకున్నారు. ఆ విధంగా సీతమ్మ ఫోటో బ్రిటిష్ రాణి వద్దకు లండన్ చేరింది. రాణి తన పట్టాభిషేకం రోజు సీతమ్మ ఫోటో ప్రక్కనే ఉంచుకుని పట్టాభిషేకం చేయించుకున్నారు అని పెద్దలు చెబుతుంటారు.అర్థరాత్రి రెండుగంటల సమయంలో వర్షంలోతడిసిన వ్యక్తి “అమ్మా సీతమ్మ తల్లి .. ఆకలేస్తుందమ్మా” అని పిలవగానే ఎంతో ఆప్యాయంగా వంటచేసి అన్నం పెట్టి ,దుప్పటి ,వస్త్రాలు ఇవ్వగలిగిన ఔదార్యవతి డొక్కాసీతమ్మ తల్లి. ఆంధ్రుల కీర్తిని ఇంగ్లండు వరకు వ్యాపింపజేసిన మహా ఇల్లాలు సీతమ్మ . అన్నం పెట్టేటప్పుడు ఆమె చూపే మాతృప్రేమ మరువరానిది. నేటి తరానికి ఆమె గొప్పదనం గురించి తెలియదు.
అన్నదానాన్ని మించిన దానంలేదని చెప్పటమే కాకుండా నిస్వార్ధంగా జాతి, కుల, మత విచక్షణ చూపించకుండా అన్నార్తులందరికీ మాతృప్రేమను పంచి జీవితాన్ని చరితార్ధం చేసుకున్న ‘అపర అన్నపూర్ణమ్మ’మన డొక్కా సీతమ్మ.. జాతిరత్నం. 1909 ఏప్రియల్ 28న శివైక్యం చెందారు. డొక్కా సీతమ్మ జీవిత చరిత్రను గురించి నేటి తరానికి తెలియచేయటం, ప్రభుత్వాలు గతంలో ఈమె చరిత్ర కోసం పాఠంశాలుగా చేర్చి పిల్లలకు నేర్పించేవారు రాను రాను వారి గురించి ఇప్పుడు తరానికి ఆమె చేసిన నిస్స్వార్ధ సేవలను గుర్తుచేసి ఆమె చరిత్రనుండి స్ఫూర్తివంతుల ను చేయటమే ఆమహానీయురాలికి మనం ఇవ్వగలిగే ఘనమైన నివాళి!….
