ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్‌లో సగం ధరకే ఫోన్లు..
ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్‌లో సగం ధరకే ఫోన్లు..
ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ 2026 జనవరి మూడవ వారంలో ప్రారంభం కానుందని సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ భారీ సేల్‌కు సంబంధించిన వివరాల కోసం ప్రత్యేక మైక్రోసైట్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేల్‌లో ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, బ్లూటూత్ స్పీకర్లు, ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు, టాబ్లెట్‌లు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు భారీ తగ్గింపు ధరలకు లభించనున్నాయి. ప్రముఖ బ్రాండ్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు ఉంటాయని సంస్థ వెల్లడించింది.
ఈ రిపబ్లిక్ డే సేల్ 2026 జనవరి 17 నుంచి ప్రారంభమవుతుంది. అయితే ఫ్లిప్‌కార్ట్ ప్లస్, ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ సభ్యులకు జనవరి 16 నుంచే ముందస్తు యాక్సెస్ కల్పించనున్నారు. దేశంలో జరుపుకునే 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సేల్ నిర్వహించనున్నారు.
ఈ సేల్‌లో బ్యాంక్ ఆఫర్లు ప్రధాన ఆకర్షణగా ఉండనున్నాయి. ఎంపిక చేసిన బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డులపై తక్షణ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, సులభమైన వాయిదాల చెల్లింపు సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. కొన్ని స్మార్ట్‌ఫోన్లు, ఇతర గాడ్జెట్లు 50 శాతం వరకు తగ్గింపు ధరలకే లభించే అవకాశం ఉందని సమాచారం. కొత్త సంవత్సరంలో ఎలక్ట్రానిక్స్ కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు ఈ సేల్ మంచి అవకాశంగా మారనుంది.
