రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

తిరుమలలో బయోగ్యాస్ ప్లాంట్ పనుల పురోగతి పరిశీలన

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

తిరుమలలో బయోగ్యాస్ ప్లాంట్ పనుల పురోగతి పరిశీలన

మార్చిలో ప్లాంట్ అందుబాటులోకి వచ్చే అవకాశం

భక్తుల వసతి సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి

తిరుమల, ఫిబ్రవరి 10 (పీపుల్స్ మోటివేషన్):

తిరుమలలో నిర్మాణంలో ఉన్న బయోగ్యాస్ (ఎల్పీజీ) ప్లాంట్ పనుల పురోగతిని బి.ఆర్. నాయుడు పరిశీలించారు. పనులు సంతృప్తికరంగా కొనసాగుతున్నప్పటికీ ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని ఇంజినీరింగ్ విభాగానికి స్పష్టం చేశారు. అధికారుల సమాచారం మేరకు మార్చి నెలలో ఈ ప్లాంట్‌ను వినియోగంలోకి తీసుకువచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ బయోగ్యాస్ ప్లాంట్ ద్వారా రోజుకు సుమారు రూ.1.20 కోట్ల వరకు ఆదా సాధ్యమవుతుందని అధికారులు వివరించారు. రోజువారీ చెత్త పునరుత్పాదన ద్వారా సుమారు 40 టన్నుల గ్యాస్ ఉత్పత్తి సామర్థ్యం ఈ ప్లాంట్‌కు ఉందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ఖర్చుల నియంత్రణకు ఈ ప్రాజెక్ట్ కీలకంగా మారనుందని పేర్కొన్నారు.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

అదే సమయంలో తిరుమలలో సామాన్య భక్తులు బస చేసే వసతి గృహాలను కూడా చైర్మన్ పరిశీలించారు. గదుల్లో కనిపించిన వాటర్ లీకేజీలను వెంటనే అరికట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని మౌలిక సదుపాయాలు సమర్థంగా ఉండాలని సూచించారు. ఇక సుదర్శన్ చౌల్టిరీని సందర్శించిన బి.ఆర్. నాయుడు అక్కడి సౌకర్యాలపై భక్తులతో నేరుగా మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు. చౌల్టిరీ పునర్నిర్మాణం లేదా ఆధునీకరణ అంశాన్ని ఇంజినీరింగ్ అధికారులతో చర్చించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. భక్తుల సౌకర్యాలే ప్రథమ లక్ష్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం పని చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

Comments

-Advertisement-