స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర ప్రకటనలకే పరిమితం: డాక్టర్ గోపిరెడ్డి
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర ప్రకటనలకే పరిమితం: డాక్టర్ గోపిరెడ్డి
- గుడ్ మార్నింగ్ నరసరావుపేట కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
- బీసీ కాలనీలో డ్రైనేజీ సమస్యలపై ఆగ్రహం
- అభివృద్ధి వైయస్ హయాంలోనే జరిగిందని వ్యాఖ్య
నరసరావుపేట, ఫిబ్రవరి 22 (పీపుల్స్ మోటివేషన్): స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం కేవలం ప్రకటనలకే పరిమితమైందని పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, నరసరావుపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఆదివారం గుడ్ మార్నింగ్ నరసరావుపేట కార్యక్రమంలో భాగంగా స్థానిక 34వ వార్డు బీసీ కాలనీలో పర్యటించారు.
ఈ సందర్భంగా కాలనీలో ఏడాదిన్నరకు పైగా డ్రైన్లు శుభ్రం చేయలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 600 మంది నివాసితులు పన్నులు చెల్లిస్తున్నప్పటికీ మౌలిక వసతులపై ఎవరూ దృష్టి సారించడం లేదని విమర్శించారు. డ్రైనేజీ సమస్యల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రోడ్లు, డ్రైన్లు వంటి మౌలిక వసతుల అభివృద్ధి వైయస్ హయాంలోనే జరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం పాలకులు మాటల్లోనే అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారని ఆరోపించారు. కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న డాక్టర్ గోపిరెడ్డి, ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
Comments
