రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

పట్టణాభివృద్ధికి కట్టుబడి పనిచేయాలి

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

పట్టణాభివృద్ధికి కట్టుబడి పనిచేయాలి

- మంత్రి పొంగులేటిని మర్యాదపూర్వకంగా కలిసిన సత్తుపల్లి, కల్లూరు ప్రజాప్రతినిధులు

- నూతన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లకు అభినందనలు

- ఖమ్మం క్యాంపు కార్యాలయంలో భేటీ

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

ఖమ్మం, ఫిబ్రవరి 22 (పీపుల్స్ మోటివేషన్):
నూతనంగా ఎన్నికైన సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీల చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఆదివారం ఖమ్మంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వారికి శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు. ప్రజలు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని, పట్టణాల అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాలని మంత్రి సూచించారు. మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుధ్యం, తాగునీరు, రహదారులు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు. ప్రజల సమస్యలను సమయానికి పరిష్కరించి విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని పేర్కొన్నారు.

ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తే పట్టణాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని మంత్రి తెలిపారు. ప్రభుత్వం నుంచి అందుతున్న పథకాలను సమర్థంగా అమలు చేసి ప్రజలకు చేరవేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్‌తో పాటు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-