మాదారం గ్రామంలో బీఆర్ఎస్ ప్రచారం
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
మాదారం గ్రామంలో బీఆర్ఎస్ ప్రచారం
- మహిళలతో ముచ్చటించిన హరీశ్ రావు
- కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు
పటాన్‌చెరువు, ఫిబ్రవరి 4 (పీపుల్స్ మోటివేషన్):
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పటాన్‌చెరువు నియోజకవర్గం గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని మాదారం గ్రామంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత టి. హరీశ్ రావు పర్యటించారు. గ్రామ వీధుల్లో ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను పలకరించారు.
ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలతో హరీశ్ రావు ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని, స్థానిక ఇబ్బందులపై వివరాలు సేకరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలైన పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను గుర్తు చేశారు. మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలంటే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలు భవిష్యత్తు దిశను నిర్ణయిస్తాయని అన్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థుల విజయంతోనే మున్సిపాలిటీల అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రజల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని హరీశ్ రావు స్పష్టం చేశారు. గ్రామస్తులు, మహిళలు ప్రచారానికి మద్దతు తెలిపారు.
Comments

