రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

“మీ గ్రామానికి మీ పులివర్తి నాని” కార్యక్రమం ప్రారంభం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

“మీ గ్రామానికి మీ పులివర్తి నాని” కార్యక్రమం ప్రారంభం

  • - రావిళ్ళవారి పల్లిలో ప్రజలతో మమేకమైన ఎమ్మెల్యే
  • - సమస్యలకు త్వరిత పరిష్కారాలపై అధికారులకు ఆదేశాలు

చంద్రగిరి, ఫిబ్రవరి 4 (పీపుల్స్ మోటివేషన్):

రామచంద్రపురం మండలం రావిళ్ళవారి పల్లిలో “మీ గ్రామానికి మీ పులివర్తి నాని” కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని హాజరయ్యారు. ఆయనకు అధికారులు, గ్రామస్తులు, కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే నేరుగా ప్రజలతో మాట్లాడారు. గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని, వాటిపై సంబంధిత అధికారులతో చర్చించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. గ్రామంలో తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, విద్యుత్, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.

ప్రభుత్వం ప్రజలకు మరింత దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో “మీ గ్రామానికి మీ పులివర్తి నాని” కార్యక్రమం చేపట్టామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

Comments

-Advertisement-