రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

గుంటూరు పశ్చిమంలో వైద్య సదుపాయాల విస్తరణపై చర్చ

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

గుంటూరు పశ్చిమంలో వైద్య సదుపాయాల విస్తరణపై చర్చ

- ఎమ్మెల్యే గళ్ళా మాధవి నివాసానికి ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్

- అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ఏర్పాటుకు సానుకూల స్పందన

గుంటూరు, ఫిబ్రవరి 4 (పీపుల్స్ మోటివేషన్):

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆహ్వానం మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆమె నివాసానికి విచ్చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన కీలక వైద్య అవసరాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నూతన అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని, ఇప్పటికే ఉన్న ఇతర ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సదుపాయాలను మరింత మెరుగుపరచాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వేగంగా పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఉందని ఆమె వివరించారు. ఎమ్మెల్యే చేసిన విజ్ఞప్తులకు మంత్రి సత్యకుమార్ యాదవ్ సానుకూలంగా స్పందించారు. నియోజకవర్గంలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ఏర్పాటు అంశాన్ని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం ప్రజారోగ్యానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని, పట్టణ ప్రాంతాల్లో కూడా వైద్య మౌలిక వసతులు విస్తరించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు.

Comments

-Advertisement-