రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ప్రజలు అన్నీ గమనిస్తున్నారు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

ప్రజలు అన్నీ గమనిస్తున్నారు

- సేవలకు సన్మానం.. మరోవైపు ప్రజలకు ఇబ్బందులు

- కేంద్ర మంత్రి పెమ్మసాని వ్యాఖ్యలపై రాజకీయ చర్చ

గుంటూరు, ఫిబ్రవరి 4 (పీపుల్స్ మోటివేషన్):

గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో తన గతించిన భార్య డాక్టర్ నిర్మల పేరుతో కోట్ల రూపాయలు వెచ్చించి పలు సేవలకు శ్రీకారం చుట్టిన ఎన్‌ఆర్‌ఐ వైద్యుడు డాక్టర్ రాజా కరణంను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తదితరులు సన్మానించారు. ప్రజారోగ్య రంగంలో వ్యక్తిగతంగా ముందుకొచ్చి సేవలు అందించినందుకు కృతజ్ఞతగా ఈ కార్యక్రమం నిర్వహించారు.



అయితే, మరోవైపు ప్రజలకు ఇబ్బందులు కలిగించే కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని బూతులు తిట్టిన వ్యక్తి కోసం చేపట్టిన యాత్రపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండు పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని, సమాజానికి సేవలందించే చర్యలు ఒకవైపు, ప్రజలను ఇబ్బందులకు గురిచేసే రాజకీయ కార్యక్రమాలు మరోవైపు సాగుతున్నాయన్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ప్రజల సమస్యలపై దృష్టి సారించి పాలన, ప్రజాసేవలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇటువంటి సందర్భాల్లో నాయకుల ప్రాధాన్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, ప్రజలే తగిన తీర్పు ఇస్తారని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Comments

-Advertisement-