రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

కవితకు కోర్టులో న్యాయం… కేసులన్నీ వీగిపోతాయి: కేటీఆర్

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

కవితకు కోర్టులో న్యాయం… కేసులన్నీ వీగిపోతాయి: కేటీఆర్

  • లిక్కర్ కేసు కట్టుకథ అని ఆరోపణ
  • రాజకీయంగా దెబ్బతీయాలనే ప్రయత్నమని విమర్శ
  • చివరికి న్యాయమే గెలుస్తుందన్న ధీమా

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

హైదరాబాద్, ఫిబ్రవరి 27 (పీపుల్స్ మోటివేషన్):
ఢిల్లీ లిక్కర్ కేసులో మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కోర్టులో న్యాయం జరిగిందని, ఇదే విధంగా తమ పార్టీ నేతలపై పెట్టిన ప్రతి అక్రమ కేసు కూడా వీగిపోతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమాల్లో స్పందించారు. లిక్కర్ స్కాం అనే కట్టుకథతో ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చేశారని, అదే కథనాన్ని అడ్డం పెట్టుకుని అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను రాజకీయంగా నష్టపరిచారని కేటీఆర్ ఆరోపించారు. కల్పిత ఆరోపణలతో సృష్టించిన కేసు ద్వారా పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీయాలని ప్రయత్నించారని విమర్శించారు. అయితే కోర్టులో కవితకు న్యాయం జరిగిందని, ఇదే స్ఫూర్తితో ఇతర కేసులూ కూలిపోతాయని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ నుంచి నిరాధార ఆరోపణలు, దుష్ప్రచారం కొనసాగుతూనే ఉంటాయని కేటీఆర్ అన్నారు. ప్రధాన పార్టీల ఆరోపణలకు మీడియా ట్రయల్స్ తోడై పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. ఆధారాలకన్నా ఆరోపణలకే ప్రాధాన్యం ఇస్తున్న కొత్త ధోరణి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్ని కుట్రలు చేసినా, ఎంత దుష్ప్రచారం చేసినా చివరికి న్యాయమే గెలుస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. తమపై మోపిన కేసులన్నీ రాజకీయ ప్రేరేపితమని, అవి త్వరలోనే అవాస్తవాలని తేలిపోతాయని ధీమా వ్యక్తం చేశారు.

Comments

-Advertisement-