కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి పెన్షన్ చెక్కు
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి పెన్షన్ చెక్కు
- రూ. 2.80 లక్షల విరాళం అందజేత
- విశ్రాంత ఉద్యోగుల పెద్దమనసు
- బదిలీల ప్రక్రియ వారం రోజుల్లో పూర్తి
హైదరాబాద్, ఫిబ్రవరి 27 (పీపుల్స్ మోటివేషన్): విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ శాఖ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ అండగా నిలిచింది. సభ్యులు తమ ఒక రోజు పెన్షన్ మొత్తాన్ని విరాళంగా ప్రకటించి రూ. 2.80 లక్షల చెక్కును అందజేశారు. ఈ చెక్కును ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సౌమ్య కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కష్టకాలంలో సహోద్యోగి కుటుంబానికి విశ్రాంత ఉద్యోగులు అండగా నిలవడం అభినందనీయమని కొనియాడారు. సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం ఇప్పటికే రూ. కోటి ఆర్థిక సాయం అందించడంతో పాటు ఆమె సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించిందని తెలిపారు. మాదకద్రవ్యాల నియంత్రణలో ఎక్సైజ్ సిబ్బంది కృషిని ప్రభుత్వం గుర్తిస్తుందని, వారికి అన్నివేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో గంజాయి, అక్రమ మద్యం నియంత్రణకు కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఎక్సైజ్ శాఖలో పెండింగ్‌లో ఉన్న బదిలీలపై కూడా మంత్రి స్పందించారు. వారం రోజుల్లోగా సుమారు 2,500 మంది కానిస్టేబుళ్ల బదిలీలను పూర్తి చేస్తామని, అనంతరం ఇతర హోదాల్లోని అధికారుల బదిలీలను దశలవారీగా చేపడతామని తెలిపారు. కుమ్మెర మల్లికార్జున స్వామి జాతరలో చిన్నారి మృతి చెందడం బాధాకరమని పేర్కొంటూ బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తెలంగాణను దేశీ, విదేశీ పర్యాటకులకు ఆకర్షణీయ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు నూతన పర్యాటక విధానం అమలు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. వాటర్ స్పోర్ట్స్, ఎకో, వెల్నెస్ పర్యాటక రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎక్సైజ్ రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు ముకుంద రెడ్డి, ప్రతినిధులు, అధికారులు, సౌమ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Comments
