రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

తిరుమల లడ్డూ కల్తీపై బాలినేని వ్యాఖ్యలు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

తిరుమల లడ్డూ కల్తీపై బాలినేని వ్యాఖ్యలు

“ఇంతటితో అంశాన్ని వదిలేయడం మంచిది”

హిందువుల మనోభావాలు దెబ్బతినొద్దని సూచన

తప్పు చేసిన వారిని దర్యాప్తు సంస్థలు చూసుకుంటాయని వ్యాఖ్య

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

అమరావతి, ఫిబ్రవరి 12 (పీపుల్స్ మోటివేషన్):
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. ఈ అంశంపై అధికార పక్షం, వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న వేళ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇప్పటికే స్పష్టంగా చెప్పారని బాలినేని పేర్కొన్నారు. ఈ విషయంపై పదేపదే చర్చించడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని అన్నారు. ఇంతటితో ఈ అంశాన్ని ముగించడం మంచిదని సూచించారు. ఎవరైనా తప్పు చేసి ఉంటే వారి విషయాన్ని శ్రీ వేంకటేశ్వరస్వామి, దర్యాప్తు సంస్థలు చూసుకుంటాయని వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఈ అంశాన్ని ఉపయోగించకూడదని ఆయన పరోక్షంగా సూచించారు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ బాధ్యతలను ఎవరికి అప్పగించాలనేది పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయిస్తారని బాలినేని తెలిపారు. పార్టీ నిర్ణయాలను అనుసరించడమే తమ విధి అని ఆయన స్పష్టం చేశారు.

Comments

-Advertisement-