రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఫుడ్‌ డెలివరీ రంగంలోకి ఫ్లిప్‌కార్ట్‌.. స్విగ్గీ, జొమాటో షేర్‌లు లాస్‌

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

ఫుడ్‌ డెలివరీ రంగంలోకి ఫ్లిప్‌కార్ట్‌.. స్విగ్గీ, జొమాటో షేర్‌లు లాస్‌

బెంగళూరు – ఫిబ్రవరి 12 – పీపుల్స్ మోటివేషన్ 

వాల్‌మార్ట్‌కు చెందిన ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) మరో కొత్త రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ‘మినిట్స్‌’ పేరుతో క్విక్ కామర్స్ విభాగంలో ప్రవేశించిన ఈ సంస్థ.. ఇప్పుడు ఫుడ్ డెలివరీ రంగంలోనూ తన సత్తా చాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ వార్తల ప్రభావంతో ఇప్పటికే ఈ రంగంలో ఆధిపత్యం చెలాయిస్తున్న స్విగ్గీ, జొమాటో కంపెనీల షేర్లు గురువారం నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

‘ఎకనామిక్ టైమ్స్’ కథనం ప్రకారం, ఈ ఏడాది మే-జూన్ మధ్య బెంగళూరులో ప్రయోగాత్మకంగా ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభించే ఆలోచనలో ఫ్లిప్‌కార్ట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరినాటికి లేదా వచ్చే ఏడాది ప్రారంభానికి పూర్తి స్థాయిలో సేవలను విస్తరించాలనే లక్ష్యంతో సంస్థ ముందుకు సాగుతున్నట్లు సమాచారం. స్విగ్గీ, జొమాటో తరహాలో స్వంత ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేయాలా లేదా ప్రభుత్వ ఈ-కామర్స్ వేదిక ఓఎన్‌డీసీ (ONDC)లో బయ్యర్ సైడ్ అప్లికేషన్‌గా సేవలు అందించాలా అనే అంశాలపై సంస్థ పరిశీలన జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ విషయంపై ఫ్లిప్‌కార్ట్ ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు.

ప్రస్తుతం దేశీయ ఫుడ్ డెలివరీ మార్కెట్‌లో స్విగ్గీ, జొమాటో సంస్థల ఆధిపత్యం కొనసాగుతోంది. ఈ రంగంలోకి గతంలో కొన్ని కంపెనీలు ప్రవేశించేందుకు ప్రయత్నించినప్పటికీ పెద్దగా విజయం సాధించలేకపోయాయి. అయితే వాల్‌మార్ట్ మద్దతు ఉన్న ఫ్లిప్‌కార్ట్ రంగప్రవేశం చేస్తుందన్న వార్తలు మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారాయి.

ఈ నేపథ్యంలో జొమాటో మాతృసంస్థ ఎటర్నల్ షేరు విలువ సుమారు 2 శాతం వరకు పడిపోయి రూ.291.40 వద్ద కనిష్ఠాన్ని తాకింది. అనంతరం కొంత మేర కోలుకుంది. అలాగే స్విగ్గీ షేరు కూడా ఒక దశలో 3 శాతానికి పైగా నష్టపోయి రూ.328 వద్ద ట్రేడ్ అయింది. గతంలో ర్యాపిడో ఫుడ్ డెలివరీ రంగంలోకి వస్తుందన్న వార్తలు వచ్చినప్పుడూ ఇదే తరహాలో షేర్లపై అమ్మకాల ఒత్తిడి కనిపించిన సంగతి తెలిసిందే.

Comments

-Advertisement-