ఉపాధి హామీ శ్రామికుల ఆవేదన వర్ణనాతీతం: వైఎస్ షర్మిల
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
ఉపాధి హామీ శ్రామికుల ఆవేదన వర్ణనాతీతం: వైఎస్ షర్మిల
- ప్రకాశం జిల్లాలో ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ పరిరక్షణ యాత్ర
- పాకల గ్రామంలో రచ్చబండ కార్యక్రమం
- వేతనాలు, పనిదినాలపై శ్రామికుల ఆవేదన
ప్రకాశం, ఫిబ్రవరి 13 (పీపుల్స్ మోటివేషన్): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్ట పరిరక్షణ యాత్ర నేడు ప్రకాశం జిల్లాలో కొనసాగింది. కొండెపి నియోజకవర్గంలోని పాకల గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో శ్రామికులు తమ సమస్యలను వెల్లడించారు. కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ షర్మిల మాట్లాడుతూ ఉపాధి హామీ శ్రామికుల ఆవేదన వర్ణనాతీతమని పేర్కొన్నారు. శ్రామికులు మాట్లాడుతూ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కరువు పనులు పండుగలా సాగేవని తెలిపారు. రవాణా చార్జీలతో పాటు పనులు జరిగే ప్రదేశాల్లో మంచినీళ్లు, మజ్జిగ, రస్నా వంటి సదుపాయాలు కల్పించేవారని గుర్తు చేశారు. ప్రస్తుతం వందరోజుల హామీ ఉన్నప్పటికీ సగం రోజులు కూడా పని దొరకడం లేదని, చేసిన పనులకు వేతనాలు ఎప్పుడు చెల్లిస్తారో తెలియని పరిస్థితి నెలకొందని వాపోయారు. పాకల గ్రామ ప్రజలు ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ పథకం కొనసాగాలని, దీనిని బలహీనపరచే చర్యలు తీసుకోవద్దని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పరిరక్షణ పోరాటానికి మద్దతుగా నిలుస్తామని తెలిపారు. VB G - RAM G చట్టాన్ని రద్దు చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం గ్రామీణ పేదలకు జీవనాధారమని, శ్రామికులకు సమయానికి వేతనాలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామీణాభివృద్ధి కోసం ఈ పథకాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.
Comments
