రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

మంత్రి పదవిపై కోమటిరెడ్డి వ్యాఖ్యలు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

మంత్రి పదవిపై కోమటిరెడ్డి వ్యాఖ్యలు

- పదవులు శాశ్వతం కావని స్పష్టం

- మునుగోడు అభివృద్ధే తన లక్ష్యమని వెల్లడి

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

హైదరాబాద్, ఫిబ్రవరి 16 (పీపుల్స్ మోటివేషన్):
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదవులు శాశ్వతం కాదని, తన నియోజకవర్గ అభివృద్ధే తనకు ముఖ్యమని పేర్కొన్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోయినా పరవాలేదని, మునుగోడు అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తే చాలని అన్నారు. ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. తనకు మంత్రి పదవి ఇవ్వాలనే హామీతోనే తాను పార్టీలోకి వచ్చానని, మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని గతంలో వెల్లడించారు. లేకపోతే ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నిస్తానని కూడా వ్యాఖ్యానించారు. మళ్లీ అడగబోనని, కానీ తనకూ ఒకరోజు వస్తుందని, ఆ రోజు పదవి లాక్కుంటానని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఒక్క ముఖ్యమంత్రి మాత్రమే కష్టపడలేదని, పార్టీలోని ప్రతి నాయకుడు శ్రమించారని ఆయన అభిప్రాయపడ్డారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీశాయి.

Comments

-Advertisement-