ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు
- జిల్లా పోలీసు కార్యాలయంలో 39 అర్జీలు స్వీకరణ
- చట్టపరమైన, వేగవంతమైన చర్యలకు ఎస్పీ దిశానిర్దేశం
శ్రీకాకుళం, ఫిబ్రవరి 16 (పీపుల్స్ మోటివేషన్): ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి ఐపీఎస్ పోలీసు అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశాలు చేశారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ మరియు పరిష్కార కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రజల నుంచి మొత్తం 39 అర్జీలు స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రతి ఫిర్యాదుదారుడి సమస్యను స్వయంగా తెలుసుకుని సానుకూలంగా స్పందించారు. చట్టపరమైన మరియు వేగవంతమైన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ప్రజలకు న్యాయం జరిగేలా సంబంధిత పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఫిర్యాదును ప్రాధాన్యత క్రమంలో పరిశీలించి నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని సూచించారు. ప్రజల విశ్వాసం నిలబెట్టే విధంగా పారదర్శకంగా వ్యవహరించాలని, ఫిర్యాదుల పరిష్కారంలో ఆలస్యం లేకుండా చర్యలు చేపట్టాలని ఎస్పీ పేర్కొన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారం పోలీసు శాఖకు అత్యంత ప్రాధాన్యత అంశమని తెలిపారు. ఆయా ఫిర్యాదులపై తీసుకున్న చట్టపరమైన చర్యలను నివేదిక రూపంలో నిర్ణీత సమయంలో జిల్లా పోలీసు కార్యాలయానికి సమర్పించాలని ఆదేశించారు. వ్యక్తిగత, కుటుంబ తగాదాలు, ఆస్తి వివాదాలు, మోసపూరిత అంశాలు, సైబర్ మోసాలు తదితర విషయాలపై ఫిర్యాదులు అందినట్లు అధికారులు వెల్లడించారు.
Comments

