రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

సంస్థాగతంగా పార్టీ బలోపేతమే జగనన్న లక్ష్యం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

సంస్థాగతంగా పార్టీ బలోపేతమే జగనన్న లక్ష్యం

- రాజమండ్రి రూరల్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ సమావేశం

- గ్రామ స్థాయి నుంచే కమిటీల నిర్మాణంపై దృష్టి

రాజమండ్రి, ఫిబ్రవరి 4 (పీపుల్స్ మోటివేషన్):

సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని నేతలు స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత కమిటీల నిర్మాణంలో భాగంగా వెంకటనగరం, తోర్రేడు, కాతేరు గ్రామాల నాయకులతో రాజమండ్రి రూరల్ మండల పార్టీ అధ్యక్షులు ఉప్పులూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణు, పార్లమెంట్ ఇంచార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాష్ట్ర అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ, పార్టీని క్రింది స్థాయి నుంచి బలోపేతం చేయాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో సంస్థాగత నిర్మాణానికి కార్యచరణ రూపొందించారని తెలిపారు. ప్రతి గ్రామం, ప్రతి మండలంలో ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ కమిటీల్లో భాగస్వామ్యం కల్పిస్తామని, అన్ని వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం ఇస్తూ పార్టీ పదవుల్లో అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు.

ప్రజలకు పార్టీని మరింత చేరువగా తీసుకువెళ్లేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుంచే బలమైన పునాదులు వేస్తే పార్టీ మరింత శక్తివంతంగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శులు నక్కా రాజబాబు, గోందేశీ శ్రీనివాసరెడ్డి, గిరిజాల బాబు, నక్క నగేష్, చెల్లుబోయిన నరేన్, అంగాడ సత్యప్రియ, యెజ్జు శ్రీనివాస్ కిరణ్, పెయ్యాల రాజేష్‌తో పాటు తోర్రేడు గ్రామ నాయకులు, మండల స్థాయి నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

-Advertisement-