విశాఖ మెట్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
విశాఖ మెట్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కీలక ముందడుగు
ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారంగా మెట్రో రైల్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10 (పీపుల్స్ మోటివేషన్):
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ శుభవార్త అందింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టు కు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు ఈ మేరకు సానుకూల స్పందన లభించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న సీఎం చంద్రబాబు, మంగళవారం పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో ఆయన కీలక భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తున్నట్లు ఖట్టర్ స్వయంగా చంద్రబాబుకు తెలిపినట్లు సమాచారం. దీంతో విశాఖ మెట్రో ఏర్పాటు దిశగా కీలక ముందడుగు పడినట్టైంది. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, భవిష్యత్ రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెట్రో రైల్ ప్రాజెక్టులను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రానికి పూర్తి ప్రతిపాదనలు కూడా పంపింది. తాజాగా విశాఖ మెట్రోకు ఆమోదం లభించడంతో, త్వరలోనే డీటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్, నిధుల కేటాయింపు, పనుల ప్రారంభంపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు పై కూడా కేంద్రం నుంచి త్వరలో స్పష్టత వచ్చే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. విశాఖ మెట్రోకు లభించిన ఈ అంగీకారం రాష్ట్రంలో పట్టణ రవాణా వ్యవస్థను ఆధునీకరించే దిశగా కీలక మైలురాయిగా మారనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Comments
