రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

నరవణే పుస్తకంపై వివాదం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

నరవణే పుస్తకంపై వివాదం

లోక్‌సభలో ప్రస్తావనతో రాజుకున్న రాజకీయ వేడి

పెంగ్విన్ ప్రకటన–రాహుల్ ప్రశ్నలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10 (పీపుల్స్ మోటివేషన్):

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

మాజీ ఆర్మీ చీఫ్ ఎం.ఎం. నరవణే రచించిన ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం రాజకీయంగా వివాదాస్పదంగా మారింది. ఈ పుస్తకంలోని కొన్ని అంశాలను ఇటీవల రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రస్తావించడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దాంతో వారం రోజులుగా లోక్‌సభ కార్యకలాపాలు సజావుగా సాగడం లేదు. పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ, ఈ అంశంపై నరవణే చేసిన ఓ ట్వీట్‌ను చదివి వినిపించారు. తాను రాసిన పుస్తకం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉందని, లింక్ ఓపెన్ చేస్తే విషయాలు తెలుస్తాయని నరవణే ట్వీట్‌లో పేర్కొన్నట్లు రాహుల్ వెల్లడించారు. ఈ పుస్తకాన్ని పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ప్రచురించినట్లు సమాచారం ఉన్నప్పటికీ, సంస్థ మాత్రం ఇప్పటివరకు పుస్తకాన్ని విడుదల చేయలేదని తాజాగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ కీలక ప్రశ్నలు లేవనెత్తారు. నరవణే అబద్ధం చెబుతున్నారా? లేక పెంగ్విన్ సంస్థ అబద్ధం చెబుతోందా? అని ప్రశ్నించారు. ప్రింట్ లేదా డిజిటల్ ఫార్మాట్‌లో పుస్తకాన్ని విడుదల చేయలేదని పెంగ్విన్ స్పష్టం చేస్తుండగా, అమెజాన్‌లో పుస్తకం అందుబాటులో ఉందని తాను చెబుతున్నట్లు రాహుల్ పేర్కొన్నారు. అయితే పెంగ్విన్ కంటే నరవణే వ్యాఖ్యలనే నమ్ముతున్నానని, నరవణే అబద్ధం చెప్పరని భావిస్తున్నానని రాహుల్ తెలిపారు. ఈ విభేదాల మధ్య నిజం ఏంటన్నది ఇప్పటికీ నిర్ధారణ కాలేదని ఆయన వ్యాఖ్యానించారు.

Comments

-Advertisement-