రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

తోతాపురి మామిడి ధరల రికార్డు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

తోతాపురి మామిడి ధరల రికార్డు

- టన్నుకు రూ.1,05,000 పలికిన మార్కెట్

- ఎగుమతులతో రైతులకు లాభాలు

- ఉత్తరాదిన డిమాండ్ ప్రభావం

విస్సన్నపేట, ఫిబ్రవరి 10 (పీపుల్స్ మోటివేషన్):

ఆంధ్రప్రదేశ్లో వేసవి రాకముందే మామిడి ఎగుమతులు ఊపందుకున్నాయి. ముఖ్యంగా తోతాపురి మామిడి రకానికి డిమాండ్ పెరగడంతో ధరలు కూడా గణనీయంగా పెరిగి రైతులకు మంచి లాభాలు అందుతున్నాయి.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

ఎన్‌టిఆర్ జిల్లా విస్సన్నపేట నుంచి ఎగుమతి అయిన తోతాపురి మామిడి రకానికి ముంబై మార్కెట్‌లో రికార్డు స్థాయిలో టన్నుకు రూ.1,05,000 ధర పలకడం విశేషంగా మారింది. ఈ ధర ఈ సీజన్ ప్రారంభంలోనే రావడం రైతుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. వ్యాపారుల సమాచారం ప్రకారం, ఉత్తరాదిన మామిడికి డిమాండ్ పెరగడం వల్లే ధరలు ఈ స్థాయికి చేరుకున్నాయి. నాణ్యమైన పంట, ఎగుమతులపై దృష్టి పెరగడం కూడా ధరల పెరుగుదలకు కారణమవుతోంది.

గతేడాది సీజన్ చివర్లో చిత్తూరు ప్రాంతంలో తోతాపురి మామిడి ధరలు టన్నుకు రూ.12 వేల నుంచి రూ.14 వేల వరకు పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ప్రారంభంలోనే ఇంతటి ధర రావడం రైతులకు ఊరట కలిగించే పరిణామంగా మారింది.

Comments

-Advertisement-