మండలిలో ఆందోళనపై రాజకీయ రగడ
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
మండలిలో ఆందోళనపై రాజకీయ రగడ
- “ఆధారం చూపితే రాజీనామా” – వైసీపీ ఎమ్మెల్సీ సవాల్
- వీడియో విడుదల చేసిన మంత్రి సంధ్యారాణి
- పరస్పర ఆరోపణలతో ఉద్రిక్త వాతావరణం
అమరావతి, ఫిబ్రవరి 20 (పీపుల్స్ మోటివేషన్): ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో వైసీపీ సభ్యులు వెంకటేశ్వరస్వామి చిత్రాలను పట్టుకుని ఆందోళన చేపట్టిన ఘటనపై రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. చెప్పులు, బూట్లు వేసుకుని దేవుడి ఫొటోలతో సభలోకి వెళ్లినట్లు నిరూపిస్తే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని వైసీపీ ఎమ్మెల్సీ మాధవరావు సవాల్ విసిరారు. ఈ సవాల్‌కు స్పందించిన మంత్రి సంధ్యారాణి, వైసీపీ సభ్యులు చెప్పులతో ఉన్నట్లు కనిపిస్తున్న వీడియోను విడుదల చేశారు. స్వామివారి చిత్రాలను ప్లకార్డుల మాదిరిగా వినియోగించడం సరికాదని, ఇది దుర్మార్గ చర్యగా పేర్కొన్నారు. ఒకరు చిత్రాన్ని తలకిందులుగా పట్టుకున్నారని, నిరసన అనంతరం టేబుల్‌పై పడేశారని ఆరోపించారు. వైసీపీ సభ్యులకు దేవుడిపై భయం, భక్తి లేవని మంత్రి విమర్శించారు. స్వామివారి పట్ల అవమానకర ప్రవర్తన చేశారని ఆరోపిస్తూ మాధవరావు తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామాలతో మండలిలో జరిగిన ఘటనపై రాజకీయ చర్చ మరింత ముదిరింది. ఇక వైసీపీ వర్గాలు తమపై చేసిన ఆరోపణలు అసత్యమని పునరుద్ఘాటిస్తున్నాయి. పరస్పర ఆరోపణలు, సవాళ్ల మధ్య ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Comments
