కాకినాడ అర్బన్‌లో ఆదర్శ ఉపాధ్యాయురాలి కృషికి లోకేశ్ ప్రశంసలు
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
కాకినాడ అర్బన్‌లో ఆదర్శ ఉపాధ్యాయురాలి కృషికి లోకేశ్ ప్రశంసలు
ఆటలతో పాఠాలు… విలువలతో విద్య
విద్యార్థుల సంఖ్య 134 నుంచి 183కి పెరిగిన మున్సిపల్ స్కూల్
కాకినాడ, ఫిబ్రవరి 10(పీపుల్స్ మోటివేషన్):
పిల్లల్లో ఒకరిగా కలిసిపోయి ఆటలు, పాటల ద్వారా విద్యాబోధన చేస్తూ, నైతిక విలువలు, పరిశుభ్రత, ఆరోగ్యపు అలవాట్లపై అవగాహన కల్పిస్తున్న ఉపాధ్యాయురాలి కృషిని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ప్రశంసించారు. కాకినాడ అర్బన్ పరిధిలోని శ్రీ ముళ్లపూడి వెంకట్రావు మున్సిపల్ ప్రాథమిక పాఠశాల (శంతనపురి కాలనీ, గోదారిగుంట–2)లో ఎస్జీటీగా పనిచేస్తున్న అడబాల హర్షిత తేజశ్రీ గారి సేవలను ఆయన అభినందించారు. గ్యారంటీడ్ ఎఫ్‌ఎల్‌ఎన్, ఆటల ఆధారిత బోధన పద్ధతులను సమర్థంగా అమలు చేస్తూ, వాటిని సోషల్ మీడియా ద్వారా ఇతరులకు స్ఫూర్తిగా ప్రచారం చేయడం అభినందనీయమని లోకేశ్ పేర్కొన్నారు. పిల్లలకు తెలుగు భాష గొప్పతనం అర్థమయ్యేలా సందర్భానుసార కార్యక్రమాలు నిర్వహిస్తున్న తీరు ప్రశంసార్హమన్నారు. విద్యాశాఖ అధికారులు, తోటి ఉపాధ్యాయుల సహకారంతో గత విద్యా సంవత్సరంలో పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను 134 నుంచి 183కి పెంచిన తీరు ఉపాధ్యాయురాలి అంకితభావానికి నిదర్శనమని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకాన్ని పెంచేలా ఇలాంటి కృషి మరెందరో ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తుందని నారా లోకేశ్ అభిప్రాయపడ్డారు.
Comments
